Krishna Mukunda Murari Serial September 28th Episode: భవానీ దగ్గరకి ముకుంద వెళ్ళి ఆదర్శ్ వచ్చేలా లేడని తనకి నమ్మకం లేదని అంటుంది.


ముకుంద: పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నా కానీ ఆదర్శ్ ఇప్పటి వరకు రాలేదు


భవానీ: కానీ ఇప్పుడు వస్తాడు. కల్నల్ నమ్మకంగా చెప్పాడు


ముకుంద: ఇన్ని రోజులు రాని వాడు ఇప్పుడు ఎలా వస్తాడు. నాకు నమ్మకం లేదత్తయ్య


వీళ్ళ మాటలు విని కృష్ణ టెన్షన్ పడుతుంది. మురారీ ఎక్కడ తన జీవితం అని చెప్పేస్తుందేమోనని భయపడుతుంది.


భవానీ: నువ్వు అనుకున్నదాంట్లో తప్పు లేదు కానీ ఆదర్శ్ ఖచ్చితంగా వచ్చి తీరుతాడు


Also Read: కనకమా మజాకా, స్వప్న సేఫ్- అమ్మాకొడుక్కి అదిరిపోయే షాక్!


ముకుంద ఇంక ఏం చెప్పేస్తుందోనని భయంతో కృష్ణ భవానీ గదిలోకి వచ్చేస్తుంది. కృష్ణ ఎందుకు వచ్చిందని తిట్టుకుంటుంది. ఏంటి ఇలా వచ్చావని భవానీ అంటే ముకుందతో కాసేపు కబుర్లు చెప్దామని వచ్చానని చెప్తుంది. ఆదర్శ్ ని తీసుకొచ్చే బాధ్యత తనదని భవానీ ముకుందకి హామీ ఇస్తుంది. కృష్ణ తనని అక్కడి నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ భవానీకి మాత్రం డౌట్ వస్తుంది. ఆదర్శ్ రాడని ఎలా అనుకుంటుంది, ఏదో చెప్పాలని వచ్చింది. ఈసారి ఒంటరిగా తనని బయటకి తీసుకుని వెళ్ళి అడగాలని భవానీ డిసైడ్ అవుతుంది. కృష్ణ ముకుందని పక్కకి తీసుకొచ్చి మాట్లాడుతుంది.


కృష్ణ: ఆదర్శ్ రాడని నమ్మకం లేదని అన్నావ్. నేను విన్నాను. ఆదర్శ్ వస్తాడు రాడని ఫిక్స్ అవకు. తను రావాలని మీరిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఆదర్శ్ ని నేను తీసుకొస్తాను. నేను ఏది అనుకున్నా చేసి తీరుతాను. ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా నిద్రపో


ముకుంద: నువ్వు అనుకున్నవి సాధించావా? నీకు ఫెయిల్యూర్ లేదా? కానీ ఈ విషయంలో ఫెయిల్ అవుతావ్


కృష్ణ: లేదు నాకు నమ్మకం ఉంది


ముకుంద: అనవసరమైన ఆశలు ఎందుకు? అలాంటి నెగటివ్ ఆలోచనలు లేకుండా వెళ్ళి పడుకో. నాకు నా ప్రేమ మీద గట్టి నమ్మకం


కృష్ణ: చనిపోయిన ప్రేమ తిరిగి బతకదు. డిస్ట్రబ్ అవకుండా వెళ్ళి పడుకో


ముకుంద:  నువ్వే నన్ను డిస్ట్రబ్ చేస్తున్నావ్. ప్రేమించిన వాడిని ఎదురుగా పెట్టుకుని అసలు ఉన్నాడో లేదో తెలియని వ్యక్తి కోసం ఎదురుచూడటం అవివేకం. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? నేను మురారీని ప్రేమిస్తున్నా. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ప్రాణం. ఏదో చిన్న అవాంతరం రావడంతో వేర్వేరు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది. మురారీ తప్పని పరిస్థితిలో నిన్ను ఎలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నేను అలాగే చేసుకున్నా. అంతే తప్ప మా మధ్య ప్రేమ చావలేదు. మా ప్రేమ మధ్యలోకి నువ్వు వచ్చావ్. మురారీతో జీవితం ఎలా పంచుకుందామని అనుకుంటున్నావ్. నీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా?


కృష్ణ: ఈ విషయం నాకు తెలుసు. తెలిసే ఆదర్శ్ ని ఇక్కడికి తీసుకొస్తానని చెప్పాను. ఒక పెళ్లి అయిన మగాడిని కోరుకుంటూ బరితెగించింది  


ముకుంద:  షటప్ నీది పిచ్చి పెళ్లి. నిన్న వెళ్ళిపోయిన దానివి మళ్ళీ వచ్చావ్. ఎప్పుడు తెగుతుందో తెలియని బంధాన్ని పట్టుకుని వేలాడుతుంది నువ్వు


కృష్ణ: తెంపితే తెగిపోయేది కాదు పెళ్లి బంధం


ముకుంద: నేను ఇలాగే ఉంటాను. నా మెడలో తాళి ఉంది కానీ విలువ లేదు. దానికి విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? మురారీ నా మెడలో తాళి కట్టినప్పుడు


కృష్ణ: అది నేను ఉండగా జరగదు


ముకుంద: జరుగుతుంది. మురారీ పట్ల నాకున్న ప్రేమ జరిగేలా చేస్తుంది


కృష్ణ: అది నీ భ్రమ మాత్రమే


ముకుంద: జరిగేలా చేస్తాను. వీళ్ళు నిన్ను అసహ్యించుకోవడానికి ఒక్క సెకన్ చాలు. ఆ సెకన్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. నేను మురారీ కోసం తపస్సు చేశాను తాను వచ్చాడు నా మనసులో ఉన్నాడు


కృష్ణ: ఏసీపీ సర్ మనసులో నువ్వు లేవు


ముకుంద: మరి నువ్వు ఉన్నావా?నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు నువ్వు ఉన్నావా? చెప్పలేవు. మురారీ మనసులో స్థానం సంపాదించలేవు. కానీ తన మనసులో నాకు స్థానం ఉంది. మరి నీకు ఏముంది


కృష్ణ: తాళి చూపించి ఇది ఉందని అంటుంది


Also Read: KGF బ్యాంగ్రౌండ్ తో పిండేశారు, అమ్మా అని పిలిచిన రిషి - శైలేంద్ర దొరికిపోతాడా


ముకుంద: అది తాడు మాత్రమే


కృష్ణ: అవునా మరి అయితే నీ మెడలో ఉన్న తాళి తెంపేయ్. అది కట్టిన వాడికి నీ మనసులో స్థానం లేకపోయినా దాన్ని తెంపలేవు. ఎప్పటికైనా తాళి కట్టిన వాడితోనే నా జీవితం


ముకుంద: మురారీ నా వాడు


కృష్ణ: అసలు జరగని వాటి గురించి ఆశపడకు. ఇప్పుడు చెప్తున్నా విను నేను ఒక్కదాన్ని నిలబడి నా భర్తని దక్కించుకుంటాను


ముకుంద: అది నేను ఉండగా జరగదు


కృష్ణ: అసలు ఏమనుకుంటున్నావ్ నువ్వు. పెళ్లి అయిన రోజే వెళ్లిపోయాడంటే నిగురించి ఏమనుకుంటున్నారో తెలియదు. నా గురించి నీకు తెలియదు. నువ్వు ఏం చేసిన నువ్వు అనుకున్నది జరగదు


ముకుంద: జరిగి తీరుతుందని ఇద్దరూ ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటారు


మురారీ మనసులో తన మీద ఉన్న ప్రేమ గురించి బయట పడేలా చేయాలని కృష్ణ అనుకుంటుంది. నిద్రపోతున్న మురారీని నిద్రలేపి కాసేపు బుర్ర తింటుంది. తలస్నానం చేసి వచ్చి తన జుట్టుకు ఉన్న నీళ్ళు మురారీ మీద పడేలా చేస్తుంది. మురారీ ప్రేమగా భార్యకి తల తుడుస్తాడు.