గుప్పెడంతమనసు సెప్టెంబరు 28 ఎపిసోడ్


శైలేంద్ర-దేవయాని ఓవరాక్షన్ చూడలేక వసుధార అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెనుకే ఫాలోఅవుతాడు శైలేంద్ర
శైలేంద్ర: నేను పగబడితే ఎలా ఉంటుందో ఇప్పటికైనా తెలుసుకోండి.. అనుకున్నది దక్కించుకునేందుకు ఎంతదూరం అయినా వెళతాను
వసు: మీరు చేసిన పాపాలకు శిక్ష పడకతప్పదు
శైలేంద్ర: ఎన్ని హత్యలు చేసినా ఒకటే శిక్ష పడుతుంది. నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయింది..మీలో భయం మొదలైంది
వసు: భయపడుతున్నది మీకు కాదు..మీ నాన్నగారి గురించి..దీన్ని అసులుగా తీసుకుంటే నష్టం మీకే
ఇంతలో వసుధార అని వస్తాడు రిషి..ఏం మాట్లాడుకుంటున్నారని అడిగితే..నీ గురించే అడుగుతున్నా..అటాక్ జరిగినప్పుడు మీకేం కాలేదు కదా
వసు: సార్ అక్కడే ఉన్నారని మీకెలా తెలుసు..
శైలేంద్ర: తన ప్రాణాలు కాపాడబోయి పిన్ని ప్రమాదంలో పడిందని ముందే చెప్పాడు కదా అని కవర్ చేస్తాడు
వసుధార ఏదో చెప్పేందుకు ట్రై చేస్తుంటే...తర్వాత మాట్లాడుదాం రా అని పిలుస్తాడు..


Also Read: అమ్మ కావాలంటూ రిషి కన్నీళ్లు, దేవయానికి షాక్ ఇచ్చిన ధరణి - శైలేంద్ర విశ్వరూపం!


జగతి రాసిన లెటర్ విష్ కాలేజీకి చేరుతుంది. దానిపై పర్సనల్ అని రాసి ఉండడంతో ప్రిన్పిపాల్ ఆ కవర్ ఓపెన్ చేయడు.. రిషి సార్ ఈ రోజు కాలేజికి రాలేదు వచ్చాక ఇస్తానని దాచేస్తాడు.  అటు హాస్పిట్లో రిషి..దేవయాని దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటాడు. స్టార్టింగ్ నుంచి జరిగినవన్నీ గుర్తుచేసుకుని బాధపడతాడు...
దేవయాని: నేను తనని ద్వేషించాను, దూరం పెట్టాను..కానీ మేడం అవేమీ పట్టించుకోకుండా నా ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలు ఫణంగా పెట్టింది. తన వ్యక్తిత్వం ఎలాంటిదో దగ్గర నుంచి చూశాను. తన సంస్కారమే నా జన్మ సంస్కారం అని తెలుసుకున్నాను. అమ్మా అని పిలుపుకోసం తహతహలాడిపోయింది. నాక్కూడా అమ్మా అని పిలివాలని ఉండేది.కానీ  నా గతం తాలూక జ్ఞాపకాలు ఆ పిలుపుని ఆపేశాయి. నా గతం నా గుండెల్ల్ని గుచ్చేస్తూ ఉండేది. అందుకే మేడంని అమ్మా అని మనసారా పిలవాలని ఉన్నా పిలవలేకపోయాను...తనమీద నాకున్న తల్లిప్రేమని మనసులోనే దాచుకున్నాను పెద్దమ్మా ..మా అమ్మకి ఏం కాదుకదా...
ఏం కాదు క్షేమంగా ఉంటుందని దేవయాని నటిస్తుంది...
రిషి: నేను ఏం ఇస్తే ఆ తల్లి రుణం తీరుతుంది పెద్దమ్మా..నేను తనని అమ్మా అని పిలిస్తే రుణం తీరుతుందా..నా తల్లి రుణం తీర్చాలంటే నాకీ జన్మ సరిపోదు...నా తల్లిని నేను చాలా కష్టపెట్టాను..తన మనసుని మాటలతో చాలా బాధపెట్టాను.. పెద్దమ్మా నాకు బాధవేసినా, సంతోషం వేసినా చిన్నప్పటి నుంచీ నీ వడిలోనే తలవాల్చుకుని చె్పుకునేవాడిని కదా నాకిప్పుడు నా కన్నతల్లి ఒడిలో తలవాల్చుకుని బాధ చెప్పుకోవాలి అనిపిస్తోంది..
లోలోప దేవయాని రగిలిపోతుంటుంది...శైలేంద్ర వింత వింత ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంటాడు...


మహేంద్ర..ఇదంతా ఎవరివల్ల జరిగింది, ఎవరు చేశారని  ఫణీంద్ర అడుగుతాడు... ఎవరని చెప్పాలి అన్నయ్యా అని శైలేంద్ర వైపు చూస్తుంటాడు.. తన గురించి చెప్పేస్తాడేమో అనే భయంతో టాపిక్ డైవర్ట్ చేస్తాడు శైలేంద్ర. తన నాటకాన్ని ఎలా బయటపెట్టాలో తెలియడం లేదు అన్నయ్యా...ముందు జగతి కోలుకుని బయటకు వస్తే అన్నిటికీ కారణం శైలేంద్ర అని నిరూపిస్తాను అనుకుంటాడు మహేంద్ర...
శైలేంద్ర: లోపలకు వెళ్లి జగతిని చూసి.. నువ్వు బతికేసి నన్ను చంపేస్తావా ఏంటి..నువ్వు తొందరగా చావాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నా అంటాడు
ఇంతలో అక్కడకు వచ్చిన ఓ పోలీస్ రిషిని మాట్లాడేందుకు పిలుస్తాడు...


Also Read: హాస్పిటల్లో జగతి - తల్లడిల్లిన రిషి, విడిపోతున్న చిక్కుముడులు - త్వరలోనే శుభం!


ఏంటి శ్మసానానికి వెళుతుందా..ఇంటికి వస్తుందా అన్న దేవయాని..అది బతికితే నేను చచ్చినట్టే అన్న దేవయాని..పోలీస్ ఆఫీసర్ వచ్చాడు వెళ్లి ఏంటో కనుక్కో అని పంపిస్తుంది. సస్పెక్ట్ కింద ఒకతన్ని గుర్తించాం అని పోలీసులు చెప్పడంతో..వాడిని వెతికి తీసుకురండి అంటాడు శైలేంద్ర. మీకు ఎవరిపైన అయినా అనుమానాలున్నాయా అంటే..రిషి బదులు అన్నీ శైలేంద్రే సమాధానం చెబుతాడు. ఇంతలో శైలేంద్రకి ఆ విలన్ నుంచి కాల్ వస్తుంది
శైలేంద్ర: పేమెంట్ సార్ అంటాడు విలన్.. నువ్వెక్కడున్నావో చెప్పు నేనే వచ్చి పేమెంట్ ఇస్తానంటాడు.. 
రిషి పోలీసులు వెళ్లిపోయాక బయటే కూర్చుని ఉండిపోతాడు..వసుధార వస్తుంది..పోవీస్ ఆఫీసర్ తో మాట్లాడారా రండి సార్ అక్కడ అందరూ ఉన్నారు, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తారంటుంది
రిషి: నాకే ఎందుకిలా జరుగుతోంది..ఒకప్పుడు నాన్నకి ఆరోగ్యం బాగోపోతే ఇదే పరిస్థితి. ఈరోజు అమ్మ..నా లైఫ్ లోనే ఇలా జరుగుతోందా.. లేదా అందరికీ ఇలాగే జరుగుతోందా..అమ్మని ఆ పరిస్థితుల్లో చూస్తుంటే నా మైండ్ పనిచేయడం లేదు..నా మనసంతా అదోలా ఉంది, తీసుకోలేకపోతున్నా..ఈ బాధని అణుచుకోలేకపోతున్నా
వసు: ఎంత బాధ పడితే అంత బాధపడండి..కన్నీళ్లు వస్తే రానివ్వండి..ఏడుపొస్తే ఏడవండి..అప్పుడు మీ బాధ భారం తీరిపోయే అవకాశం ఉంది.. మీరు ఎంతైనా బాధపడండి కానీ అధైర్య పడకండి..జగతి మేడంకి ఏం కాదు..తనకి మీరంటే ప్రాణం...ఆ ప్రాణం నిలబెట్టానన్న తృప్తితో ఆవిడ బతికివస్తారు
రిషి: నా మనసులో ఓ కోరిక బలంగా ఉంది..ఇన్నాళ్లూ నాపై చూపించిన ప్రేమకు బాకీ ఉన్నాను.. మేడం స్పృహలోకి రాగానే అమ్మా అని పిలవాలి..క్షేమంగా తిరిగారావాలి, మునుపటిలా హుందాలా ఉండాలి..
వసు: మీరు అమ్మా అంటున్నారు కదా అదే మేడంకి ఆయువు అవుతుంది..రండి సార్ వెళదాం అంటుంది వసుధార. 
లోపలకు వచ్చిన ఫణీంద్రతో..పెదనాన్న మీరు వెళ్లి రెస్ట్


గుప్పెడంతమనసు సెప్టెంబరు 29 ఎపిసోడ్ (Guppedanta Manasu September 29th)


జగతి చేయి పట్టుకుని సోరీ అమ్మా...నేను బతికినంత కాలం ననిన్ను అమ్మ అని పిలుస్తాను.. ఒక్కసారి కళ్లు తెరువమ్మా అంటాడు... అక్కడి నుంచి వెళ్లిపోతుండగా రిషి అని పిలుస్తుంది జగతి... అమ్మా అమ్మా అని పిలుస్తాడు రిషి...