Brahmamudi Serial September 28th Episode : రాహుల్ తప్పించుకునేందుకు చెప్పే సమాధానాలు విని కావ్య ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. దీంతో రాహుల్ తలనొప్పితో అల్లాడిపోతున్నట్టు నటిస్తాడు. డాక్టర్ పేషెంట్ ని డిస్ట్రబ్ చేయవద్దని చెప్పి బయటకి పంపించేస్తాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ మామూలుగా ఉంటాడు. ఇప్పుడు అందరూ స్వప్న కోసం వెతుకుతూ ఉంటారని సంబరపడతాడు. కనకం రోడ్డు మీద ఉంటే తను ఉన్న దగ్గరకే మైఖేల్ వాళ్ళు వస్తారు. రాహుల్ మైఖేల్ కి ఫోన్ చేసి స్వప్న పని ఎంతవరకు వచ్చిందని అడుగుతాడు. దండలు కొనడానికి వచ్చామని నోరు జారతాడు.


మైఖేల్: స్వప్నని చంపేశాను శవం మీద వేయడానికి దండలు వేయాలి కదా అవి కొనడానికి వచ్చాను


రాహుల్: అయితే సరే వీడియో కాల్ చేసి చూపించు


మైఖేల్: శవం డెన్ లో ఉంది


రాహుల్: సరే నువ్వు కనిపించకుండా అండర్ గ్రౌండ్ కి వెళ్లిపో


ALso Read: విక్రమ్ ప్రేమకు దివ్య ఫిదా - తులసిని చంపేస్తానని నందుని బెదిరించిన రత్నప్రభ


అక్కడ కూరగాయలు కొంటున్న బండి దగ్గర ఉన్న కనకాన్ని మైఖేల్ పిలుస్తాడు. ఆంటీ అని పిలిచేసరికి కనకం వాడిని కొడుతుంది. సరే అక్క అని పిలుస్తాడు.


మైఖేల్: నేను పెళ్లి చేసుకోబోతున్నా అని సిగ్గుపడుతూ చెప్తాడు


కనకం: నీ మొహానికి పెళ్ళా


మైఖేల్: మంచి దండలు కొనివ్వు. అప్పుడే పంతులు ఫోన్ చేసి పెళ్లి చేయడానికి అడ్రస్ అడిగితే మైఖేల్ మొత్తం చెప్తాడు. పూల దండ కొనేసి కనకం వెళ్ళిపోతుంది. మైఖేల్ పక్కన ఉన్న వాడు పెళ్లి కూతురు ఆల్రెడీ కడుపుతో ఉంది కదా దండ వేస్తే బరువుగా ఉంటదని అంటాడు. అది విని కనకం ఆశ్చర్యంగా కడుపుతో ఉన్న అమ్మాయితో పెళ్లి ఏంటని గడ్డి పెడుతుంది.


మైఖేల్: నాకు కాబోయే భార్య ఏంజెల్ లా ఉంటుంది. చూపిస్తాను చూడు


కనకం: ఏంజెల్ అయితే ఏంటి ఏమైతే నాకు ఎందుకు


మైఖేల్: నువ్వు ఏమన్నా సరే ఏంజెల్ ని చూసి తీరాల్సిందే అని స్వప్న ఫోటో చూపిస్తాడు. అది చూసి కనకం షాక్ అవుతుంది. ఏంటి నా ఫియాన్సీని చూసి షాక్ అయ్యావా? అనేసి వెళ్ళిపోతాడు.


పోలీసులు హాస్పిటల్ కి వస్తారు.


ఎస్సై: ఎవరో ప్లాన్ చేసి కిడ్నాప్ చేసినట్టుగా ఉంది. రాహుల్ ఏమో కిడ్నాపర్స్ ని గుర్తు పట్టలేను అంటున్నాడు


రాజ్: బిజినెస్ లో కూడా మాకు విరోధులు ఎవరు లేరు


ఎస్సై: మొన్న విగ్రహాలు మాయం అయ్యాయి. ఇప్పుడు ఇలా జరిగినది. ఇలా వెంట వెంటనే జరగడం మామూలు విషయం కాదు. ఆ విగ్రహాలు మాయం చేయడం కూడా డబ్బు కోసం కాదు మీ మీద పగ తీర్చుకోవడం కోసం చేసినట్టుగా ఉంది. ఆ విగ్రహాలు దొంగిలించిన వాళ్ళు కొట్టి అడిగితే ఏమైనా క్లూ దొరకొచ్చు  


రుద్రాణి: మాకు కోడలు ఇంటికి రావడం కావాలి. విగ్రహాల గురించి కాదు


ఎస్సై: ఎక్కడో ఒక చోట కిడ్నాపర్ తప్పు చేసి మాకు దొరికిపోతాడు. స్వప్న ఎక్కడ ఉన్న తనని వెతికి పట్టుకుంటాను


రుద్రాణి: స్వప్నని వాళ్ళు ఏమైనా చేశారో ఏమోనని మరింత నటిస్తుంది. ఆ మాటలకి కావ్య మరింత కంగారుపడుతుంది. స్వప్నకి ఏమి కాదని రాజ్ ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ కావ్య డీలా పడిపోతుంది. కనకం కంగారుగా కావ్యకి ఫోన్ చేస్తుంది. అబద్ధం చెప్పి మోసం చేయడం కంటే నిజం చెప్పమని రాజ్ కావ్యకి చెప్తాడు.


కనకం: స్వప్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు


Also Read: అమ్మ కావాలంటూ రిషి కన్నీళ్లు, దేవయానికి షాక్ ఇచ్చిన ధరణి - శైలేంద్ర విశ్వరూపం


కావ్య: ఏడుస్తూ చెప్పడం తన వల్ల కాదని రాజ్ కి ఫోన్ ఇచ్చేస్తుంది


రాజ్: స్వప్న ఎక్కడ ఉందో తెలియదు


కనకం: అదేంటి రాహుల్ వాళ్ళు హనీ మూన్ కి వెళ్లారని చెప్పారు కదా


రాజ్: స్వప్నని ఎవరో కిడ్నాప్ చేశారు. రాహుల్ ని కొట్టి తీసుకెళ్ళి పోయారు. కానీ కంగారుపడొద్దు స్వప్న దొరుకుతుంది పోలీసులు వెతుకుతున్నారు


కనకం: అంటే ఇందాక వాడు చెప్పింది నిజమే. స్వప్నని వాడే కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి. నా కూతురిని ఎలాగైనా కాపాడుకోవాలి. మైఖేల్ ఫోన్లో పంతులు గురించి చెప్పిన అడ్రస్ గుర్తు చేసుకుంటుంది. కనకం పంతులు వేషం వేసుకుని రోడ్డు మీద నిలబడుతుంది.


తరువాయి భాగంలో..


కావ్య ఫోన్ కి లొకేషన్ షేర్ చేస్తుంది కనకం. కాసేపటికి వీడియో కాల్ చేసి పెళ్లి జరుగుతుంది.. పెళ్లి కొడుకుని చూడమని కావ్య, రాజ్ కి చూపిస్తుంది. వాళ్ళని చూసి రాజ్ వాళ్ళు షాక్ అవుతారు. స్వప్న చనిపోయిందని అనుకుని అమ్మాకొడుకులు సంతోషపడుతూ ఉంటారు.