Parag Agarwal New StartUp : పరాగ్ అగర్వాల్. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ ను ఖరారు చేసినప్పుడు ఇండియాలో ఆయన పేరు మార్మోగిపోయింది. ట్విట్టర్ ను స్ట్రాంగ్ గా నిర్వహించడంలో.. విజయవంతంగా నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ట్విట్టర్ పై ఎలన్ మస్క్ కు కోపం వచ్చింది. అందుకే ఆయన కొనుగోలు చేయాలనుకున్నాడు. ట్విట్టర్ అసలు విలువ కన్నా ఎంతో ఎక్కువగా 44 బిలియన్ డాలర్లు పెట్టి కొనేశారు. అలా చేసిన తర్వాత ఆయన చేసిన మొదటి పని సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్ ను తీసేయడం.
మస్క్ బ్లాక్ చేయమన్న ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయనందుకు కోపం
పరాగ్ మీద ఎలన్ మస్క్ ఎందుకు అంత కోపం పెంచుకున్నారంటే.. ఓ సారి మస్క్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ ను ఓ వ్యక్తి ట్రాక్ చేసి.. తన ట్విట్టర్ అకౌంట్ లో లైవ్ పెట్టాడు. ఆ అకౌంట్ ను బ్లాక్ చేయాలని మస్క్ ఒత్తిడి తెచ్చారు. కానీ అది తమ విధానాలకు విరుద్దమని పరాగ్ పట్టించకోలేదు. దీంతో పట్టుదలగా ట్విట్టర్ ను కొనేసిన మస్క్ వెంటనే పరాగ్ ను ఉద్యోగం నుంచి తొలగించాడు.
ఎవరీ ర్యాన్ వెస్లీ రౌత్..? ట్రంప్ ని ఎందుకు చంపాలనుకున్నాడు..?
రూ. నాలుగు వందల కోట్లు పరాగ్‌కు సెటిల్మెంట్
ట్విట్టర్‌లో జీతం ప్లస్ స్టాక్ అప్షన్స్ కలిపి ఏటా రూ. వంద కోట్లకుపైగా జీతాన్ని పరాగ్ అగర్వాల్ అందుకునేవారు. కానీ మస్క్ ఉన్న పళంగా రూ. నాలుగు వందల కోట్లతో సెటిల్ చేసి పంపేశారు. అయితే తమకు ఇంకా రావాల్సి ఉందని పరాగ్ తో పాటు మరికొందరు మస్క్ పై దావా వేశారు. ఇప్పుడా దావా కోర్టుల్లో ఉంది. ట్విట్టర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పరాగ్ అగర్వాల్ ఎక్కడా ఉద్యోగ ప్రయత్నం చేయలేదు. తానే సొంతంగా ఓ స్టార్టప్ పెట్టుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మీద పని చేసే లార్జ్ లాంగ్వేజ్ మెడల్స్ కోసం సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో చిరునవ్వుతోనే డొనాల్డ్ ట్రంప్‌ను తొక్కిపడేసిన కమలాహారిస్
ఏఐ కంపెనీ పెట్టిన పరాగ్ అగర్వాల్
తన కంపెనీ ఇప్పుడు ఇన్వెస్టర్లకు హాట్ ఫేవరట్ గా ఉంది. ఖోస్లా వెంచర్స్ పరాగ్ అగర్వాల్ స్టార్టప్ లో రూ. 249 కోట్లు పెట్టేందుకు అంగీకరించింది. అలాగే తన పెట్టుబడితో ఇప్పటికే కంపెనీని బిల్డ్ చేస్తున్నారు. తర్వలో పరాగ్ అగర్వాల్ మరోసారి టెక్ ప్రపంచంలో సంచలనంగా మారినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. మరో వైపు మస్క్ ట్విట్టర్ తో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చారు. ఇప్పుడా కంపెనీ వాల్యూ సగానిపైగా పడిపోయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.