PM's rally in J And K's Doda today: ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వినూత్న నిర్ణయాలతో దూసుకు పోతున్న నరేంద్రమోదీ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ఎర్రకోటపై బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ప్రొటెక్షన్ లేకుండానే గత 11 ఏళ్లుగా ప్రసంగిస్తూ వస్తున్న మోదీ.. ఇప్పుడు జమ్ము కశ్మీర్‌లో అత్యంత సున్నిత ప్రాంతమైన దోడా జిల్లా ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. 1982లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆ జిల్లాలో ఏ ప్రధాని కూడా ఏ విధమైన సభలు కానీ కార్యక్రమాలు చేపట్టలేదు.
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మోదీ ఆ సాహసం చేస్తున్నారని కేంద్ర మంత్రి, జమ్ము కశ్మీర్ ఎన్నికల భాజపా ఇంఛార్జ్ జి కిషన్ రెడ్డి చెప్పారు. ఆగస్టు 31న జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నగారా మోగించగా.. మోదీ ఇవాళ్టి బహిరంగ సభతో ఆ రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. సెప్టెంబర్ 19న కశ్మీర్‌లోయలో జరిగే ఎన్నికల ర్యాలీలో కూడా మోడీ పాల్గొననున్నారు. ఆర్టికల్ 370 రద్దు సహా ఇతర అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించనుండగా.. దాదాపు పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌కు ఎన్నికలు జరగనుండగా.. అవి మూడు దశల్లో జరగనున్నాయి. మోడీ పర్యటన దోడాలో జరగనున్న వేళ పక్కన ఉన్న క్రిష్టావర్‌లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. పలు అంచెల సెక్యూరిటీతో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 2014లో సార్వత్రిక ఎన్నికల వేళ క్రిష్టావర్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అప్పటి నుంచి దోడాలో కూడా మోదీ ర్యాలీ కోసం ఆ ప్రాంత ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని.. స్థానిక బీజేపీ నేత పేర్కొన్నారు.
Also Read: మనదేశంలో గణేష్ నిమజ్జనానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే!
జమ్ము మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్‌గా ఉండగా.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 25 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత ఇప్పుడే శాసనసభ ఎన్నికలు జరగనుండగా.. బీజేపీ తమపట్టు నిలుపుకునేందుకు మోదీ బహిరంగసభ ఉపకరిస్తుందని అక్కడి నేతలు ఆశిస్తున్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు సహా ఆ రాష్ట్రానికి ప్రత్యేకపతిపత్తి ఎత్తేసిన తర్వాత జరుగుతున్న తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో దేశం యావత్ ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోంది. జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడి కానున్నాయి.
మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో మార్పులు చోటుచేసుకోగా..
లాల్‌చౌక్‌పై దాదాపు 73 ఏళ్ల తర్వాత భారత జెండా ప్రజల మధ్య ఎగురేయడం చాలా గొప్పవిషయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతారు. మోదీ దేశంలో ఎన్నో ప్రాంతాలకు వెళ్లిన మొదటి ప్రధానిగానూ రికార్డు సృష్టించారు. లక్ష దీవులకు వెళ్లి కుర్చీ వేసుకుని తీరంలో కూర్చుంటేనే.. మాల్దీవుల టూరిజం కూసాలు కదిలి పోయాయి. అప్పటి వరకూ చైనా పంచన చేరి భారత్‌ను ఇబ్బంది పెడుతూ వస్తున్న మాల్దీవుల సర్కారు.. దెబ్బకు దెయ్యం వదిలి దారికి వచ్చింది. తొలిసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత 2015లో ఆప్గనిస్థాన్‌కు వెళ్లిన మోదీ.. కాబూల్ నుంచి ఆకస్మికంగా లాహోర్ వెళ్లడం అప్పట్లో సంచలం సృష్టించింది.
Also Read: తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదల- ఘన స్వాగతం పలికిన ఆప్ నేతలు