Chittoor Crime News: గత రెండు రోజులు కాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పది మందిని మృత్యువు కబలించింది... 40 మంది వరకు గాయాలు పాలు చేసింది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నివారణ చర్యలు తీసుకోవడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.
* ఎదురొచ్చిన మృత్యువు
తిరుపతి మదనపల్లె మార్గం కేవలం ఒకటే మార్గం ఉంటుంది. గురువారం జరిగిన ప్రమాదం గురించి పరిశీలిస్తే తిరుమల దర్శనం చేసుకుని తిరిగి తమ ఇంటికి వెళ్తున్న కర్నాటక వాసులకు కలకడ నుంచి టమోటో లోడుతో చెన్నై వెళ్తున్న లారీ రూపం లో ఎదురొచ్చి కారు పై పడింది. లారీ బ్రేక్ ఫెయిల్ అవ్వడం, లోడ్ అధికంగా ఉండడం ప్రధాన కారణం గా తెలుస్తోంది. ఈ ప్రమాదం అయితే రోడ్డు ఒక్కటే కావడం వల్ల ఎదురుగా వేగం గా వచ్చిన లారీ కారు పై పడడంతో మృత్యువు కబలించింది.
శుక్రవారం సాయంత్రం మొగిలి ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదం అయితే తిరుపతి అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమల నుంచి బెంగళూరు కు ప్రయాణమైంది. చిత్తూరు నుంచి బంగారుపాళ్యం మీదుగా మొగిలి దాటి పలమనేరు కు చేరుకునే సమయంలో మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదం లారీ రూపం లో ఎదురొచ్చింది.
పలమనేరు వైపు నుంచి ఇనుప కమ్ములు వేసుకుని వస్తున్న లారీ వేగంగా చిత్తూరు వైపు వస్తుంది. ఈ లారీ అధిక లోడ్ తో వేగంగా వచ్చి పలమనేరు వైపు వెళ్తున్న బస్సుపైకి అటు వైపు రోడ్డు నుంచి డివైడర్ పై నుంచి ఆపోజిట్ రోడ్డు లోకి చొచ్చుకొచ్చి వేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ వేగానికి ఆర్టీసీ బస్సు వెనుక ఉన్న గ్రానైట్ తో పలమనేరు వైపు వెళ్తున్న మరో లారీనీ ఢీకొట్టింది. ఇనుప కమ్ములతో వచ్చిన లారీ వెనుక ఉన్న మరో లారీ మధ్యలో పడి బస్సు అందులోని ప్రయాణికులు మృతి చెందారు. సుమారు 31 మంది తీవ్ర గాయాలు అయ్యాయి. సుమారు 8 మందికి పైగా ఎమర్జెన్సీ చికిత్స పొందుతున్నారు.
రెండు ఘాట్ రోడ్ల పై ప్రత్యేక నిఘా
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ప్రధాన ఘాట్ రోడ్డులు ఉన్నాయి. ఇందులో భాకరాపేట, పలమనేరు రెండు కూడా ప్రతిరోజు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నవి. ఇక్కడ ప్రమాదం జరిగింది అంటే ఎన్ని మరణాలు సంభవించాయి అనే రీతిలో జీవితాలను చిదిమేస్తుంది. ప్రతినిత్యం ప్రమాదాలకు నెలవుగా మారుతున్న ఘాట్ రోడ్డులో ఏదైన పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటే తప్ప అధికారులు అటు వైపు చూడరు. ఆ రోజు ప్రమాదం గురించి మాట్లాడి ఆ తరువాత నివారణ చర్యలు తీసుకోవడం పై దృష్టి పెట్టడం లేదు.
వాహన డ్రైవర్లదే తప్పు
ప్రమాదం జరిగిన ప్రాంతాలను తిరుపతి, చిత్తూరు జిల్లా అధికారులు పరిశీలన చేసారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించారు. రోడ్డు రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. డౌన్ ఘాట్ రోడ్డు లో వచ్చే వాహనాలు ఎక్కువ శాతం న్యూట్రల్ లో దిగుతున్నారు... అనుకోని మలుపులు ఊహించక వేగం నియంత్రణ చేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయి నిర్థారించారు. ప్రమాదానికి ఎక్కువ శాతం ఎత్తు నుంచి కిందకు వచ్చే వాహనాలే కారణంగా తేల్చారు. ఇక పై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఘటన స్థలాన్ని, క్షతగాత్రులను స్థానిక ప్రజా ప్రతినిధులు పరిశీలన చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు విస్తరణ, వేగం తగ్గించే మార్గాలు పై దృష్టి సారించాలని సూచించారు.