Chittoor Bus Accident News: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మొగిలి ఘాట్ దగ్గర ఓ బస్సు రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. దాదాపు 30 మందికి పైగా గాయాలు అయ్యాయి. శుక్రవారం (సెప్టెంబరు 13) మధ్యాహ్నం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్లే మెయిన్ రోడ్డుపై పలమనేరు పరిధిలోని మొగిలి ఘాట్‌ దగ్గర లారీలు బస్సు ఢీకొన్నాయి. పలమనేరు వైపు నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఒకదానికొకటి ఢీకొని మరో టెంపో మీదకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలోనే ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గాయపడ్డ వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




చిత్తూరు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి


చిత్తూరు జిల్లా మొగ‌లి ఘాట్ వ‌ద్ద జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో 7 గురు మృతి చెంద‌డంపై సీఎం చంద్ర‌బాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి బెంగుళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీ నీ డీకొన్న ఘటనలో  7 గురు ప్రాణాలు కోల్పోగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం....సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.  బాధిత కుటుంబాల‌ను ప్రభుత్వం ఆదుకుంటుందని అని తెలిపారు.