Police Leave Letter : మనలో చాలా మంది చిన్నప్పుడు స్కూల్‌కు డుమ్మా కొట్టేసి ఉంటాయి. లీవ్ లెటర్ ను రాసి నాన్నతో సంతకం పెట్టించుకు రమ్మని టీచర్లు కూడా అడుగుతూ ఉంటారు. కానీ లీవ్ లెటర్ ను రైట్ హ్యాండ్‌తో నాన్న సంతకాన్ని లెఫ్ట్ హ్యాండ్‌తో చేసేసి ఇచ్చేస్తూంటాం. పెద్దయిన తర్వాత ఆఫీసుల్లోనూ అంతే. సెలవు కావాలని.. అడిగి ఎందుకు అంటే. గుర్తొచ్చిన కారణం చెబుతూ ఉంటారు. కానీ మనం అంతా ఒకటి.. యూపీలోని గౌరవ్ ఒకటి. ఎందుకంటే ఆయన లీవులు పెట్టాలనుకుంటే.. గాలి కబుర్లు చెప్పడం... నిజమైన కారణాలు చెబుతాడు. పైగా పోలీసు ఉద్యోగం అబద్దం చెప్పడాన్ని అసహ్యించుకుంటాడు. అందుకే ఇప్పుడు మనం ఆయన గురించి చెప్పుకోవాల్సి వస్తోంది.
యూపీకి చెందిన గౌరవ్ ఎనిమిదేళ్ల కిందట పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. అసలే పోలీసు ఉద్యోగం.. కొత్త కాపురం అయినా ఎలాగోలా మేనేజ్ చేసుకున్నాడు. అయితే ఇంట్లో శుభకార్యం ఉందని తప్పనిసరిగా రావాల్సిందేనని.. రాకపోతే బాగుండని చెప్పి ఆయన భార్య పుట్టింటికి వెళ్లింది. వారం రోజుల పాటు సెలవు పెట్టాల్సిందేనని స్పష్టం చేసింది. చేసే పోలీసు ఉద్యోగంలో అన్ని రోజులు సెలవులు ఇవ్వరని .. గౌరవ్ సైలెంట్ గా ఉండిపోయాడు. దీంతో అతని భార్య మాట్లాడటం మానేసింది. ఇక మాట్లాడకపోతే జీవితంలో ఒంటరిగా మారిపోతానేమోనని భయపడిన గౌరవం వెంటనే.. ఉన్నతాధికారికి లీవ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు.
తన లీవ్ అప్లికేషన్ లో ఏదో సమస్య చెప్పుకోలేదు.. తన అసలైనసమస్యనే చెప్పుకున్నాడు. ‘వివాహం జరిగినా అచ్చటా ముచ్చట తీర్చుకోలేదు. శుభాకార్యం కోసం వెళ్లాల్సి ఉంది. రాను అంటున్నందుకు నాపై అలకబూనింది. నేను కాల్ చేసినా స్పందించడం లేదు స్. వెళ్లి ఆమెకు సర్ది చెప్పాలి. లీవ్ ఇవ్వండి.’ అంటూ పైఅధికారికి లీవ్ లెటర్ రాశాడు . “మ్యారేజ్ తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లలేదు. నా భార్య ఫోన్ చేసినా కట్ చేస్తుంది. కొన్నిసార్లు ఫోన్ ఎత్తి.. మాట్లాడమని ఆమె తల్లికి ఇస్తోంది. అందుకే నాకు లీవ్స్ ఇవ్వండి సార్ ” అని రాసుకొచ్చాడు. సాటి మగాడిగా.. ఓ భర్తగా ఆ కానిస్టేబుల్ ఇబ్బంది అర్థం చేసుకొన్న ఏఎస్పీ అతీశ్ కుమార్ సింగ్.. 5రోజులు లీవ్స్ ఇచ్చాడు. గౌరవ్ కాపురాన్ని నిలబెట్టాడు.
గౌరవ్ లీవ్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసు అంటే ఆ మాత్రం నిజాయితీ ఉండాలని కొంత మంది ప్రశంసిస్తున్నారు. మరికొంత మంది ఇలాంటి సమస్య ప్రతి ఒక్క కొత్తగా పెళ్లయిన మగాడికీ ఉంటుందని... కానీ గౌరవ్ ఏ మాత్రం సిగ్గుపడకుండా బయట పెట్టుకున్నారని.. మిగిలిన వాళ్లు చెప్పుకోవడం లేదని అంటున్నారు. మొత్తానికి పోలీసు లీవ్ లెటర్ ఇప్పుడు హాట్ టాపిక్.
మీరిచ్చే టీ అస్సలు తాగను, విషం కలిపారేమో ఎవరికి తెలుసు - పోలీసులతో అఖిలేష్ యాదవ్