KRMB Issue : కృష్ణా బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలి - విశాఖకు ఏం సంబంధమని జగన్‌కు బైరెడ్డి ప్రశ్న !

కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసలు కృష్ణానదికి, విశాఖకు ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు.

Continues below advertisement

 

Continues below advertisement

KRMB Issue : కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును విశాఖలో పెట్టాలని సీఎం  జగన్ నిర్ణయించడంపై రాయలసీమలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ల అసలు విశాఖకు కృష్ణా నదికి ఏం  సంబంధం అని.. కర్నూలులో కేఆర్ఎంబీని పెట్టాలనే డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఈ అంశంపై కొత్తగా పోరాటం ప్రారంభించారు. కేఆర్ఎంబీ చైర్మన్ ను కలిసి కృష్ణా బోర్డును పరివాహక ప్రాంతంలోనే పెట్టాలని.. వైజగ్‌లో పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. . కృష్ణా నదితో ఏమాత్రం సంబంధం లేని విశాఖకు కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని తరలించడం ఎంతవరకు సబబని బైరెడ్డి ప్రశ్నించారు. దాన్ని కర్నూలుకు తరలించాలని ఆయన డిమాండ్‌చేశారు.

ఈనెల 28న చలో సిద్దేశ్వరంకు పిలుపునిచ్చిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి 

కృష్ణా నదిపై వంతెన నిర్మించాలనే డిమాండ్‌తో ఈనెల 28న చలో సిద్దేశ్వరం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. కృష్ణా నది పై ఐకానిక్‌ వంతెన నిర్మిస్తే అది సెల్ఫీలకు మాత్రమే పనికొస్తుందని అన్నారు. దాని స్థానంలో బ్రిడ్జ్‌ కమ్‌ బ్యారేజ్‌ నిర్మిస్తే రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ విషయమైనా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ను కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు.  వెనుకబడిన ప్రాంతాలకు మరోసారి అన్యాయం చేయొద్దని బైరెడ్డి కోరారు. తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కార్యాలయం సానుకూలంగా స్పందించిందని బైరెడ్డి చెబుతున్నారు. 

హైదరాబాద్‌లోని కేఆర్ఎంబీ బోర్డును విశాఖకు తరలించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం 
 
నిజానికి హైదరాబాద్‌లో ఉన్న కృష్ణా రివర్ మేనేజె మెంట్ బోర్జును విజయవాడలో పెట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇక విజయవాడకు తరలించడమే తరువాయి అని అనుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన కేఆర్ఎంబీ మీటింగుల్లోనూ మార్పు గురించి మాట్లాడలేదు. అయితే ఎప్పుడు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత  కృష్ణాబోర్డును విశాఖకు తరలించాలని అనుకున్నారు. అసలు విశాఖకు కృష్ణానదికి సంబంధం ఏమిటని.. విజయవాడలో పెట్టడం ఇష్టం లేకపోతే కర్నూలులో పెట్టవచ్చు కదా అని వస్తున్న సూచనలను ప్రభుత్వం అంగీకరించడం లేదు. 

విశాఖ కృష్ణా పరివాహక ప్రాంతం కాదని..  కర్నూలులో పెట్టాలని చాలా కాలంగా డిమాండ్స్ 

విభజన చట్టం ప్రకారం గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు హైదరాబాద్‌లో...  కృష్ణాబోర్డు ఏపీలో ఉండాలని నిర్ణయించారు. అయితే గోదావరి లేకపోయినా  హైదరాబాద్ జీఆర్ఎంబీని పెట్టారు కాబట్టి..  తాము విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా భావిస్తున్నందున .. తాము కేఆర్ఎంబీని అక్కడే పెడతామని ఏపీ సర్కార్ చెబుతోంది.    ఈ వ్యవహారం రాయలసీమలో చర్చనీయాంశం అవుతోంది. గతంలో రాయలసీమ పరిరక్షణ సమితిని పారటీని ఏరపాటు చేసి సీమ హక్కుల కోసం ఉద్యమించిన బైరెడ్డి ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్  బోర్డు కార్యాలయాన్ని  కర్నలులో ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. 

ఒక రోజు గ్యాప్‌తో కేసీఆర్, మోదీ బహిరంగసభలు - తెలంగాణలో రాజుకుంటున్న రాజకీయం !

Continues below advertisement
Sponsored Links by Taboola