Akhilesh Yadav Tea:
లక్నో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో..
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ యూపీలోని లక్నో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లారు. పార్టీ కార్యకర్త అరెస్ట్‌ను నిరసిస్తూ ఎస్‌పీ కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. వాళ్లకు మద్దతు తెలపడానికి అఖిలేష్ వెళ్లారు. అయితే...అక్కడే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అఖిలేష్‌కు వెల్‌కమ్ చెప్పిన పోలీసులు మర్యాదపూర్వకంగా టీ తాగాలంటూ ఆఫర్ చేశారు. ఆయన మాత్రం అందుకు ఒప్పుకోలేదు. టీ తాగను అని తేల్చి చెప్పారు.
"నేను మీరిచ్చే టీ తాగను. నా టీ నేను తెచ్చుకున్నాను. కేవలం కప్ ఇవ్వండి చాలు. ఇక్కడి టీ అస్సలు తాగను. అందులో విషం కలుపుతారేమో ఎవరికి తెలుసు..? నాకు మీపై నమ్మకం లేదు. నిజంగానే చెబుతున్నాను. నాకు నమ్మకం లేదు. నేను టీ బయట నుంచి తెప్పించుకుంటాను"
- ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
బయట నుంచి టీ..
అప్పటికప్పుడు ఓ పార్టీ కార్యకర్తకు చెప్పి బయట నుంచి టీ తెప్పించుకున్నారు అఖిలేష్. తమ పార్టీ సోషల్ మీడియా వర్కర్ మనీష్ జగన్ అగర్వాల్‌ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తనతో మాట్లాడటానికి ఏ ఒక్క సీనియర్ అధికారి కూడా అందుబాటులో లేరని అసహనం వ్యక్తం చేశారు. దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారన్న అక్కసుతోనే తమ పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేశారంటూ ఎస్‌పీ మండి పడుతోంది. అయితే...అఖిలేష్ వచ్చాక చాలా సేపటికి ఉన్నతాధికారులు
అక్కడికి వచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ ఇచ్చిన ఫిర్యాదుని స్వీకరించారు. బీజేపీ ఐటీ సెల్‌లో పని చేసే రిచా రాజ్‌పుత్ అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్‌పై అభ్యంతరకర భాషలో పోస్ట్‌లు పెట్టారని కంప్లెయింట్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా....FIR నమోదు చేశారు.
Also Read: Abortion Pills: ఇకపై అన్ని ఫార్మసీల్లో అబార్షన్ పిల్స్ విక్రయాలు, ప్రిస్క్రిప్షన్ మాత్రం మస్ట్