How Can Books Help With Anxiety: పుస్తకాలు తరచుగా కొత్త ప్రపంచాలకు గేట్‌వేలుగా, జ్ఞానాన్ని పెంపొందిచుకోవటానికి సాధనాలుగా ఉపయోగపడుతాయి. చాలా మందికి, కాగితం సువాసనే ఉత్సాహాన్నిస్తుంది. అయినప్పటికీ, యాంగ్జైటీ డిజార్డర్స్ తో పోరాడుతున్న వారికి సరైన పుస్తకాలు ఎంచుకోవటం కష్టమైన పని. టైటిల్స్ చూసి 'ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది ', ' మీ మానసిక రుగ్మతలకు ఇదే పరిష్కారం ' వంటి పుస్తకాలు కనపడితే సహజంగా ఆ పుస్తకాలనే ఎంచుకుంటూ ఉంటారు. అవి మంచి పుస్తకాలు అవొచ్చు..కాకపోవచ్చు. యాంగ్జైటీ ట్రిగ్గర్స్ అందరికీ ఒకేలా ఉండవు. ఇలాంటి సమయంలో మరింత క్లిష్టమైన ఆలోచనలు రేకెత్తించే పుస్తకాలు చదివితే ఒత్తిడి తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యంగ్జైటీ డిజార్డర్స్ తో బాధపడుతున్నారు. జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్, సోషల్ యాంగ్జైటీ, పానిక్ డిజార్డర్, రకరకాల ఫోబియాలు తీవ్రమైన ఒత్తిడిని, ఆందోళనను, భయాలను పెంచి రోజూవారి జీవితాన్ని కష్టంగా మారుస్తాయి.
పుస్తకాలు చదవటం వల్ల ఒక కంఫర్ట్ ,ఉత్సాహం, జీవితంలో ఎన్నో విషయాల్లో క్లారిటీ వస్తుంది. అయితే, యాంగ్జైటీతో బాధపడుతున్న వారు ప్రస్తుతానికి కొన్ని రకాల జానర్‌లు చదవకపోవటం మంచిది. అవి ఎంత బెస్ట్ సెల్లింగ్ ఆథర్ బుక్స్ అయినా సరే..
ఎలాంటి పుస్తకాలు యాంగ్జైటీని పెంచుతాయి?
ఓవర్వెల్మింగ్ ఛాయిస్ లు:
ఇంట్లో చదవని పుస్తకాలు, ఎక్కువమంది సజెస్ట్ చేసినవి, కిండిల్ లోనో, బుక్ స్టోర్ లోనో ఎక్కడంటే అక్కడ పాపులర్ బుక్స్ కనిపిస్తాయి. ఇందులో ఏది ఎంచుకోవాలో యాంగ్జైటీ ఉన్నవారికి మామూలు వారి కంటే కూడా కష్టం. దీన్ని డిసిషన్ పెరాలిసిస్ అంటారు. ఏ నిర్ణయం తీసుకోవటానికైనా ఇబ్బంది కలిగి యాంగ్జైటీ ట్రిగ్గర్ చేస్తుంది. సరైన పుస్తకాన్ని ఎంచుకోలేమేమో, లైఫ్ చేంజింగ్ కంటెంట్ మిస్ అవుతామేమో అనే భయం ఇందుకు కారణం. పుస్తకాల ఎంపిక విషయంలోనే కాదు. ఏ నిర్ణయం అయినా యాంగ్జైటీ ఉన్నవారిని డిసిషన్ పెరాలిసిస్ ఇబ్బందికి గురి చేస్తుంది.
ఎమోషనల్ గా ఎంగేజ్ చేసే పుస్తకాలు:
పుస్తకాలను ఆనందం, బాధ, కోపం, భయం రకరకాల ఎమోషన్స్ ని కలిగించే శక్తి ఉంటుంది. చదివేటపుడు పుస్తకాన్ని బట్టి ఈ భావాలు కలగటం సహజమే. యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నవారు.. ఎమోషన్స్ కి ఎక్కువ వల్నరబుల్ గా ఉంటారు. ప్రతీ ఎమోషన్ తీవ్రంగా, ఇబ్బందిగా ఉంటుంది. అలాంటపుడు ఎక్కువ ఎమోషన్స్ ని ట్రిగ్గర్ చేసే పుస్తకాలు చదివితే ఒత్తిడి తీవ్రమవుతుంది.
రియాలిటీకి దూరంగా ఉండే పుస్తకాలు:
చాలామంది రియాలిటీ నుంచి ఎస్కేప్ అవటానికి, ఆ విధంగా ఓదార్పు పొందటానికి నిజ జీవితానికి ఏ మాత్రం దగ్గరగా లేని ఫిక్షన్స్ చదువుతారు. అందులోంచి బయటపడి రియాలిటీని అంగీకరించటం కష్టమవుతుంది. తమ జీవితం అలా అందంగా లేదని కుమిలిపోతూ డిస్ట్రెస్ కు గురవుతారు కూడా.
ట్రిగ్గరింగ్ కాంటెంట్:
సోషల్ మీడియా, న్యూస్ లాంటి సోర్సులలో వయిలెన్స్, క్రైం, ట్రోమా లాంటి ట్రిగ్గరింగ్ కాంటెంట్ చదవటం వల్ల ఇంట్రూసివ్ ఆలోచనలు, పానిక్ అటాక్స్ రావొచ్చు.
ఈ విషయాలు భయపెట్టటానికి కాదు..చాలామంది వారి ట్రిగ్గర్స్ ఏ రకంగా మొదలవుతున్నాయో తెలుసుకోవటంలో ఫెయిల్ అవుతుంటారు. నిదానంగా అనలైజ్ చేస్తే సులభంగా తెలుసుకోవచ్చు.
యాంగ్జైటీ ఉన్నవారు పుస్తకాలు కానీ, టీవీలొ చూసే కంటెంట్ గానీ, లైట్ హార్టెడ్ వి ఎంపిక చేసుకోవటం మంచిది. ఒత్తిడికి కారణాలు ఒక్కో మనిషికి వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు ఒకరి జీవితంలో ఫెయిల్యూర్ యాంగ్జైటీకి కారణమైతే..పదే పదే దాన్నుంచి బయటపడటానికి ఫెయిల్యూర్ ని అధిగమించటానికి సంబంధిచిన పుస్తకాలు వెతుక్కొని చదవటం ఈ సమయంలో మరింత ఒత్తిడికి గురి చేస్తుంది. ఆ పుస్తకాల్లో ఇలా చేయండి..అలా చేయండి..ఈ రూల్స్ పాటించండి లాంటి విషయాలు మరింత బరువుగా మారుతాయి. ఇన్‌ఫర్మేషన్ ఎక్కువగా లేకుండా..హ్యూమరస్ కాంటెంట్ ఉన్న పుస్తకాలు, సున్నితంగా ఎక్కువ ఎమోషన్స్ తో సంబంధం లేని పుస్తకాలు, కామిక్ బుక్స్, కథల పుస్తకాల వంటివి ప్రశాంతతను ఇస్తాయి.