Thailand Mass Shooting: థాయ్‌లాండ్‌లో కాల్పులు కలకలం రేగింది. చైల్డ్‌ కేర్ సెంటర్‌పై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 34 మంది వరకు మృతి చెందారు.






ఇదీ జరిగింది


నోంగ్​బువా లంఫూ పట్టణంలో ఉన్న పిల్లల డే కేర్​ సెంటర్​లో గురువారం ఈ ఘటన జరిగింది. తుపాకీతో లోపలకు చొరబడిన ఓ వ్యక్తి ఇష్టానుసారంగా కాల్పులు జరిపాడు. చిన్నారులపై తూటాల వర్షం కురిపించాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపే అనేక మంది అక్కడికక్కడే మరణించారు.






సమాచారం అందిన వెంటనే పోలీసులకు అక్కడకు చేరుకున్నారు. ఇంతలో ఉన్మాది వారిపైనా కాల్పులు జరిపాడు. చివరకు తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. ఈ ఘటనలో 22 మంది చిన్నారులు సహా మొత్తం 34 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడ్ని మాజీ పోలీసు అధికారిగా పోలీసులు గుర్తించారు.


అమెరికాలో


ఈ ఏడాది మే లో అమెరికాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా మొత్తం 21 మంది మరణించారు. అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని ఓ ప్రైమరీ స్కూలులో ఓ టీనేజర్ అయిన దుండగుడు కాల్పులు జరిపాడు. పాఠశాలలో ఉన్న 18 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. టెక్సాస్ చరిత్రలోనే ఇది అతిపెద్ద కాల్పుల్లో ఒకటిగా అధికారులు చెప్పారు. దాడి చేసిన వ్యక్తి పేరు సాల్వడార్ రామోస్ అని అన్నారు.


Also Read: North Korea Missile Test: ఆ దేశాల అండతో రెచ్చిపోతున్న కిమ్- మరో 2 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం!


Also Read: Amit Shah in Baramulla Rally: మసీదు నుంచి 'ఆజాన్' పిలుపు- అమిత్ షా ఏం చేశారంటే?