Texas Air Show Planes Collision Video:
డల్లాస్‌లో ప్రమాదం..
అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్‌షో జరుగుతుండగా...రెండు ప్లేన్స్ అనుకోకుండా ఢీ కొట్టుకున్నాయి. రెండూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయి..పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. డల్లాస్‌లో వింటేజ్ ఎయిర్ క్రాఫ్ట్‌ల ఎయిర్ షో జరిగిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నవంబర్ 12వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. Boeing B-17 విమానం గాల్లో విన్యాసాలు చేస్తోంది. అందరూ వీటిని ఆసక్తిగా చూస్తుండగా... అకస్మాత్తుగా Bell P-63 విమానం వేగంగా దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే రెండు విమానాలు బలంగా ఢీ కొట్టుకు న్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే 40 మంది బ్రిగేడ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పడంతో పాటు శిథిలాల కింద ఉన్న వాళ్ల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. రెండు విమానాల్లో మొత్తం ఆరుగురు ఉన్నారు. వీరంతా మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్విటర్‌లో చాలా మంది ఈ వీడియోలు పోస్ట్ చేశారు. గాల్లో ఓ విమానం విన్యాసాలు చేస్తుండగా మరో విమానం వచ్చి ఢీకొట్టినట్టు స్పష్టంగా కనిపించింది. గాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల పొగ అలుముకుంది. నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్ ఈ ప్రమాదంపై విచారణ చేపడుతోంది. ఎయిర్‌షోలో ఇలాంటి ప్రమాదాలు జరగటం చాలా అరుదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాకే వీటిని నిర్వహిస్తారు. కానీ...ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. ప్రొఫెషనల్ పైలట్‌లు ఇంత పెద్ద తప్పిదం ఎలా చేశారన్నదీ అర్థం కాని విషయం. రెండో ప్రపంచ యుద్ధంలో ఈ విమానాలే మిత్రదేశాలకు సహకరించి జర్మనీని ఓడించాయి. అంత శక్తిమంతమైన విమానాలు నడిపే పైలట్‌లు అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారన్నదీ అంతుపట్టని విషయం. Federal Aviation Minister of America విచారణ పూర్తి చేశాక కానీ...ఇది ఎందుకు, ఎలా జరిగిందో స్పష్టత రాదు.