Tesla Wooden Cybertruck: టెస్లా సైబర్‌ట్రక్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. భవిష్యత్‌లో రాబోయే టెక్నాలజీని ముందుగానే ఊహించి టెస్లా తయారు చేసిన వెహికిల్ ఇది. 2019లో తొలిసారి ఈ మోడల్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది సంస్థ. ఈ ట్రక్స్‌ ఎలా ఉంటాయో అప్పుడే ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ Cybertruck కోసం సొంతగా తయారు చేసిన స్టెయిన్‌లెస్ స్టీల్ అలాయ్ వీల్స్‌ని వినియోగించింది. దానికి Ultra-hard 30X అనే పేరు కూడా పెట్టింది. వాహనాల తయారీకి సాధారణంగా ఈ స్టీల్‌ని పెద్దగా వాడరు. కానీ టెస్లా మాత్రం అదే స్టీల్‌తో తయారు చేసింది. ఇప్పుడు ఇదే సైబర్‌ ట్రక్‌ని ఓ డిజైనర్ పూర్తిగా చెక్కతో తయారు చేశాడు. చూడడానికి అచ్చం టెస్లా సైబర్‌ట్రక్‌లాగే ఉన్నప్పటికీ ఇది పూర్తిగా చెక్కతో తయారు చేయడం వల్ల లుక్‌ అంతా మారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ట్రక్ ( Wooden Tesla Cybertruck) తయారు చేయడానికి 100 రోజుల సమయం పట్టింది. ఏదో తయారు చేసి మూలన పడేయలేదు. దానికి ఇంజిన్ కూడా అటాచ్ చేశాడు. ఎంచక్కా రోడ్లపైనా చక్కర్లు కొట్టాడు. అతనే స్వయంగా డ్రైవ్ చేస్తూ డెమో చూపించాడు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎలా తయారు చేశాడో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోపై క్లిక్ చేయండి. 



ND-WoodArt అనే ఓ యూట్యూబ్ ఛానల్‌లో ఈ వీడియోలు అప్‌లోడ్ చేశారు. అయితే...ఈ యూట్యూబ్ ఛానల్ మిగతా కంపెనీల కార్ల రెప్లికాలనూ ఇలాగే చెక్కతో తయారు చేస్తుంది. చెక్కని ఎంపిక చేసుకున్నప్పటి నుంచి దాన్ని డిజైన్ చేసినంత వరకూ వీడియో తీసి అది ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. నెటిజన్లు ఈ వీడియో చూసి వావ్ అంటున్నారు. ఈ వుడెన్ సైబర్‌ట్రక్‌ తయారు చేసేందుకు 15 వేల డాలర్లు ఖర్చైందట. అంటే మన కరెన్సీలో రూ.12.5 లక్షలు. అదే ఒరిజినల్ టెస్లా సైబర్ ట్రక్‌ ధర రూ.66 నుంచి రూ.88 లక్షల వరకూ ఉంటుంది. ఈ వీడియోని గతేడాది డిసెంబర్‌లో అప్‌లోడ్ చేశారు. అదే సమయానికి టెస్లా సైబర్‌ట్రక్‌ వెహికిల్స్‌ని డెలివరీ చేయడం మొదలు పెట్టింది. అయితే..ఇప్పుడు ఉన్నట్టుండి ఈ వీడియో మళ్లీ ట్రెండ్ అవుతోంది. ఈ మధ్యే టెస్లా కంపెనీ సైబర్‌ట్రక్ వెహికిల్స్‌ని వెనక్కి తెప్పించింది. దాదాపు 4 వేల వెహికిల్స్‌లో యాక్సిలరేటర్‌లో లోపం తలెత్తినట్టు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఓ లుబ్రికెంట్ కారణంగా ఈ సమస్య  వస్తున్నట్టు గుర్తించింది. 


భారత్‌లో టెస్లా ఎంట్రీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవలే టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఇండియాకి రావాల్సి ఉన్నా...ఆ ట్రిప్ రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రధాని మోదీతో భేటీ కూడా రద్దైంది. త్వరలోనే భారత్‌కి తప్పకుండా వస్తానని మస్క్ వెల్లడించారు. అయితే...ఆ తరవాత చైనాలో మార్కెట్‌పై దృష్టి పెట్టారు. అక్కడ సేల్స్‌ తగ్గిపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి మార్కెట్‌ని మళ్లీ పెంచుకునే పనిలో పడ్డారు.


Also Read: ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం, ముగ్గురు భారతీయులు అరెస్ట్