తెలంగాణలో రూ.వందల కోట్ల స్కామ్, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే - కేటీఆర్ ఆరోపణలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రూ.వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పౌరసరఫరాల శాఖలో ఈ భారీ స్కామ్ జరిగిందని అన్నారు. సన్న బియ్యం, ధాన్యం కొనుగోలు కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లలో అవకతవకలు జరిగాయని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఈ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రేవ్ పార్టీ కేసులో ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్, ఇతనిదే కీలక పాత్ర అంటున్న పోలీసులు!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తును కర్ణాటక పోలీసులు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ కేసును సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేప్ పార్టీ నిర్వహించిన వారిలో ప్రధాన నిందితుడు వాసుతో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీరిలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల అనుచరులు కొందరు ఉన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ - కారణం ఏంటంటే
టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆదివారం (మే 26) జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి బాలకృష్ణ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించారు. ఆ తర్వాత వివిధ రకాల అంశాలప చ‌ర్చించారు. ఇక బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, తదితరులు కూడా ఈ భేటీలో ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీలో మనషుల మాయం - పవన్ చెప్పిందే నిజం - అందర్నీ కాపాడగలరా?
ఆంధ్రప్రదేశ్ లో  పవన్ కళ్యాణ్ భయపడినట్టే జరిగింది. ఒక్క కంబోడియా లోనే బానిసలుగా 5000 మంది మనవాళ్ళుర  ఉన్నారని పోలీసులు తేల్చారు.  జడలు విప్పుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ భూతం .. ప్రమాదకరంగా మారుతోంది.  ఇండియా నుండి తీసుకెళ్ళి నాలుగు వేల డాలర్లకు మనుషుల్ని అమ్మేస్తున్నాయి స్మగ్లింగ్ గ్యాంగ్స్. వైజాగ్ పోలీసులు చాకచక్యం తో రక్షించిన 58 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు చెబుతున్న విషయాలు సామాన్యుల్ని భయానికి గురి చేస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకెళ్ళి చైనా  గ్యాంగ్ లకు అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి