అక్కలు క్షమాపణ చెప్పాలి- నేను వినాలి: అవినాష్
తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల, డాక్టర్ సునీత క్షమాపణలు చెప్పే రోజు కచ్చితంగా వస్తుందన్నారు వైసీపీ తరఫున కడపలో పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి. వివేక హత్య కేసులో పొద్దస్తమానం  నోటికి వచ్చినట్టు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి చేసిన కామెంట్స్ వింటూ ఉంటే కోపం రావడం లేదన్న అవినాష్ బాధేస్తోందని అన్నారు. వైఎస్‌ ఉన్నంత కాలం పోరాడిన వ్యక్తులతోనే తన అక్కలు సునీత, షర్మిల చేతులు కలిపి జగన్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అలా చేద్దాం - ఎవరిది తప్పయితే వాళ్లు జైలుకెళదాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
రేవంత్ రెడ్డి దమ్ముంటే నువ్వు ముందుకురా  నువ్వు సోషల్ మీడియాలో పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టి, ఏది ఒరిజినల్.. ఏది ఫోర్జ‌రి.. ఏది డూప్లికేట్ అనేది తేలుద్దాం అని కేటీఆర్ స‌వాల్ చేశారు.బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ మ‌న్నె క్రిశాంక్‌తో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచ‌ల్‌గూడ జైల్లో ములాఖ‌త్ అయ్యారు. మ‌న్నె క్రిశాంక్‌ను కలిసిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్
వైసీపీ అధినేత, సీఎం జగన్‌, ఆపార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులపై  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ భార్య భారతీ రెడ్డిపై కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ గొడలితో నరికేయాలి. వాళ్లే సింగిల్ ప్లేయర్‌గా ఉండాలి ఇదే భారతీ రెడ్డి స్ట్రాటజీ అంటూ విమర్శలు చేశారు. గొడ్డలితో అందర్నీ నరికేస్తే ఎవరూ పోటీ చేయరని అప్పడు సింగిల్ ప్లేయర్‌గా ఉండొచ్చని సలహా ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీ"ఆర్‌"ఎస్‌ది ఫెవికాల్ బంధం- ట్రిపుల్ ఆర్‌ వసూళ్లను మించేలా డబుల్ ఆర్ వసూళ్లు - మోదీ విమర్శలు
వేములవాడలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పదేళ్లలో తన పనితనం చూసి ఈసారి ఓట్లు వేయాలన్నారు మోదీ. ఇక్కడ ఉన్న పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. వాళ్లకు ప్రజల బాగోగులు పట్టబోవని విమర్శించారు. ప్రజల తరఫున మొదటి నుంచి ఇక్కడ పోరాటాలు చేస్తోంది ఒక్క బీజేపీ మాత్రమే అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'ప్రతినిధి 2'లో వైయస్సార్ మరణం గుర్తు చేసేలా - టార్గెట్ వైఎస్ జగన్?
'ప్రతినిధి 2'పై వైసీపీ పార్టీ సానుభూతిపరులు విమర్శలు చేశారు. ఆ సినిమా తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి వ్యతిరేకంగా ఉంటుందని ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సోదరుని కుమారుడు నారా రోహిత్ 'ప్రతినిధి 2'లో హీరో కావడం, టీడీపీ సానుభూతిపరుడిగా ముద్ర పడిన జర్నలిస్ట్ మూర్తి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై ముందు నుంచి వైసీపీ వర్గాలు అభ్యంతరాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి