Telugu News Today 04 May 2024 - కళ్యాణదుర్గంలో హోరాహోరీ - సర్వశక్తులు ఒడ్డుతున్న టీడీపీ, వైసీపీ అభ్యర్థులు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కల్యాణదుర్గం నియోజకవర్గంలో హోరాహోరీ పోరు నడుస్తోంది. నేతలు డోర్ టు డోర్ క్యాంపెనింగ్ ముగించి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు అన్ని పార్టీల నేతలు. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం అభ్యర్థులు మాత్రం ఇంకా స్పీడు తగ్గలేదు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభ్యర్థులు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అభ్యర్థులే కాదు వారి కుటుంబ సభ్యులు సైతం నిద్రాహారాలు మాని తమ భవిష్యత్తును తేల్చుకునే పనిలో పడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
"జగన్ కోసం సిద్ధం" కార్యక్రమం ప్రారంభం- ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్న వైసీపీ
జగన్ కోసం సిద్దం" పేరుతో వైసీపీ చేపట్టిన కొత్త ప్రచారం శనివారం నాడు (మే 4న) ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌లో ఉన్న లబ్ధిదారులను నేరుగా వెళ్లి కలిసి వారికి ప్రభుత్వం నుంచి అందిన సాయం వివరిస్తూ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేయడమే దీని కార్యక్రమం ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని వైసీపీ కార్యకర్తలే ముందుకు తీసుకెళ్లబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అమిత్ షాపై కేసు నమోదు - చిన్నారులతో ప్రచారం చేయించారనే ఫిర్యాదుతో ఈసీ కీలక ఆదేశాలు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పొలిటికల్ హీట్ నెలకొంటోంది. ఓవైపు రాజకీయ పార్టీల నేతల విమర్శలు, ప్రతి విమర్శలు.. మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ ప్రధాన నేతలపై ఈసీకి ఫిర్యాదులతో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ పై సైతం ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆయన ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం 48 గంటల నిషేధం విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సిద్దిపేటలో రాజీనామా చేస్తే నేనే పోటీ చేస్తా - హరీష్‌కు మైనంపల్లి సవాల్
హరీష్ రావు ఆగస్టు 15 న రాజీనామా చెయ్ సిద్దిపేట లో నేను పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు. ఒక్క హరీష్ కాదు సిద్దిపేటలో ఎవరూ ఏ అన్యాయం చేసినా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. సిద్దిపేట లో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మీద పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చెరో 8 సీట్లు పంచుకునేలా బీజేపీ, కాంగ్రెస్ ఒప్పందం - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం చేశాయని బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారని.. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌లో పాల్గొన్న మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి