Elections 2024 :  హరీష్ రావు ఆగస్టు 15 న రాజీనామా చెయ్ సిద్దిపేట లో నేను పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు.  ఒక్క హరీష్ కాదు సిద్దిపేటలో ఎవరూ ఏ అన్యాయం చేసినా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు.  సిద్దిపేట లో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మీద పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.  చక్రధర్ కు అండగా మేమున్నాం,హరీష్ రావు నమోదు చేయించిన కేసులు తప్పుడు కేసులుగా నమోదు అయినవని పోలీసు అధికారులకు చెప్పడం జరిగిందన్నారు.                         
 
 తెలంగాణ ఉద్యమం సమయంలోనే మెదక్ లో 2 సార్లు గెలిచినా...నా కొడుకును కూడా గెలిపించుకున్నానని గుర్తు చేశారు. మెదక్ లో నేను చేసిన అభివృద్ధిని చూసి  మెదక్ ప్రజలు ఆశీర్వధిస్తున్నారని..  పార్లమెంటు ఎన్నికలలో మల్కాజిగిరి,మెదక్,కంటోన్మెంట్ లలో బంపర్ మెజారిటీ తో గెలుస్తుందని జోస్యం చెప్పారు.  వామ పక్షాలతో కలిసి పని చేస్తున్నాం, మా పని మేం చేస్తున్నాం,వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని అన్నారు.  గ్రేటర్ హైదరాబాద్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆరెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అయోమయంలో, భ్రమలో బి ఆర్ ఎస్ కు ఓట్లు వేశారని.. ఈ సారి వేయరని స్పష్టం చేశారు  .                   


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి ఆయన కష్టమేనన్నారు  రేవంత్ రెడ్డి వల్లనే  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం అయిందన్నారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన వారు చెప్పిన ముఖ్య సమాచారం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గా ఉన్న కె సి ఆర్,హరీష్ రావు,కేటీఆర్ అని స్పష్టం చేశారు.  హరీష్ రావు పేరు మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  మిషన్ కాకతీయ పేరుతో చెరువు మీద నాలుగు తుమ్మ చెట్లు నాటి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని..  కాళేశ్వరం పేరుతో వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు.  హరీష్ రావు అరెస్టు కావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.       


రుణమాఫీ అంశంపై హరీష్ రావు, రేవంత్ రెడ్డి మధ్య సవాళ్లు  చోటు చేసుకున్నాయి. ఆగస్టు పదిహేనో తేదీలోపు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని హరీష్ రావు సవాల్ చేశారు. ఆ సవాల్ కు రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఆగస్టు పదిహేనులోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తానని.. చేస్తే హరీష్ రావు చేయాలన్నారు. దీంతో  హరీష్ రావు రాజీనామా చేస్తానని లేఖ తీసుకుని.. అమరవీరుల స్థూపం దగ్గర జర్నలిస్టులకు ఇచ్చారు. అయితే అది స్పీకర్ ఫార్మాట్ లో లేదన్న విమర్శలు వచ్చాయి. ఈ సవాళ్ల పరంపర అలా సాగుతూనే ఉంది. .