Telugu News: పండుగ భోగి, పాలకుడు మానసిక రోగి - జగన్‌పై చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలు
‘పండుగ భోగి.. పాలకుడు మానసిక రోగి. ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసానికి జగన్ నాంది పలికారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారు. ప్రజా సంక్షేమ పాలన మళ్లీ అమరావతి నుండే ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలో సంపద సృష్టించడమే టీడీపీ-జనసేన లక్ష్యం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని గ్రామమైన మందండంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తాడేపల్లిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు - గోపూజ చేసిన సీఎం జగన్ దంపతులు
రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం జగన్ (CM Jagan), ఆయన సతీమణి భారతితో కలిసి తాడేపల్లిలోని (Tadepalli) ఆయన నివాసంలో వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వెలిగించి సంబరాలు ప్రారంభించారు. అనంతరం గంగిరెద్దులకు సారెలు సమర్పించారు. గోపూజ చేసిన అనంతరం.. వేద పండితులు సీఎం దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఎంపీగా కేటీఆర్ పోటీ - అవకాశాల్ని మిస్ చేసుకుంటున్నారా ?
లంగాణ సాధన లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ అనుకున్నది సాధించారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అత్యున్నత స్థానానికి ఎదిగారు. పదేళ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు  మళ్లీ మొదటికి వచ్చారు. ఇప్పుడు బ్యాటన్ అందుకోవాల్సింది కేటీఆర్. పార్టీని మంచినా తేల్చినా  ఆయనదే భారం.  కొత్త తరం రాజకీయ వ్యహాలతో ముందుకు వెళ్లి యూపీలో అఖిలేష్ తరహాలో పార్టీని నిలబెడతారని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అయితే కేటీఆర్ అనూహ్యంగా ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలుతుంది, ఎమ్మెల్యేల్ని కొనేలా కేసీఆర్ ప్లాన్ - బండి సంజయ్
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రణాళిక వేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తారంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కుట్రలతో ఏమైనా చేస్తారని.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఆ నింద బీజేపీ మీద వేస్తారని విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మాజీ ఎంపీ హర్ష కుమార్‌తో బ్రదర్ అనిల్ భేటీ - గంటపాటు చర్చలు!
మాజీ ఎంపీ హర్ష కుమార్ ని బ్రదర్ అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొడుకు పెళ్లి కార్డు నిమిత్తం హర్ష కుమార్ నివాసానికి వచ్చినట్లుగా బ్రదర్ అనిల్ కుమార్ తెలిపారు. వీరి మధ్య భేటీ హర్ష కుమార్ నివాసంలోనే సుమారు గంట పాటు జరిగింది. ఈ సందర్భంగా హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు బ్రదర్ అనిల్ కుమార్ చిన్నప్పటినుంచి తెలుసని.. బ్రదర్ అనిల్ - షర్మిల వివాహానికి ముందే తమ స్నేహం ఉందని అన్నారు. తాము ఇద్దరం మంచి మిత్రులం అని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి