Breaking News: టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 16న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 16 Sep 2021 02:03 PM
రేపు నిర్మల్‌కు అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నిర్మల్‌ జిల్లాకు రానున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ వరకూ వస్తారు. నాందేడ్ నుంచి హెలీకాప్టర్‌లో నిర్మల్ సభకు హాజరవుతారని తెలంగాణ బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్మల్ సభ వద్ద రక్తదాన శిబిరం ప్రారంభించనున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు.

మహిళా అధికారిణిపై దాడి

అటవీశాఖ సిబ్బందిపై పోడు రైతులు దాడి చేశారు. ఓ మహిళా అధికారిణిపై పెట్రోల్‌తో దాడి చేశారు. భూపాలపల్లి జిల్లా పంది పంపుల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

శాసన సభ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 26న ముగిసినందున ఆరు నెలల్లోగా అంటే ఈ నెల 25లోగా తిరిగి అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే 24వ తేదీ నుంచి ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. వారం, పది రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్

టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్ నియమితులయ్యారు. నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యేగా బాజిరెడ్డిని సీఎం కేసీఆర్ ఛైర్మన్ గా నియమించారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు గోవర్దన్ కృతజ్ఞతలు తెలిపారు. 

కొనసాగుతోన్న ఏపీ కేబినేట్ సమావేశం

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినేట్ సమావేశం కొనసాగుతోంది. ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటు అంశంపై ఆమోదాన్ని తెలియజేయనుంది. ఈ తరహా అథారిటీలు 12 రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఏపీలోనూ ఇదే తరహా సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేసే అంశంపై మంత్రివర్గానికి ప్రతిపాదనలు పంపింది. ఆర్గానిక్ ఫాంగా గుర్తించిన సంస్థలు మాత్రమే ఉత్పత్తులు విక్రయించేలా కొత్త విధానం తీసుకురానున్నారు. ఆసరా పథకంలో భాగంగా రెండో విడత మొత్తాన్ని విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేయనుంది.    

రేపు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. శుక్రవారం నిర్మల్‌లో మధ్యాహ్నం 12 గం.లకు జరగనున్న భారీ బహిరంగ సభకు బీజేపీ  ఏర్పాట్లు చేస్తోంది. సభ ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతున్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌‌తో బీజేపీ సభ నిర్వహిస్తోంది. అమిత్ షా హాజరుకానున్న నేపథ్యంలో నిర్మల్ సభను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. కనీసం లక్షమందికి తగ్గకుండా సభ నిర్వహిస్తామని కమలనాథులు చెబుతున్నారు. అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు అమిత్ షా సభకు హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. కాగా రేపు కాంగ్రెస్ సభ ఉండటంతో నిర్మల్ సభపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమిత్ షా బేగంపేట్ లేదా నాందేడ్ నుంచి నిర్మల్ సభకు వెళ్లనున్నారు. 

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్లు విరాళం ఇచ్చిన ఎన్నారై

అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్న శ్రీ రవి ఐకా తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన శ్రీ రామకృష్ణ ప్రసాద్ ఇవాళ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ4.20 కోట్లు విరాళం అందించారు. ఈ మేర‌కు విరాళం చెక్కును తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అద‌న‌పు ఈవో ఏవీ.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. రవి ఐకా ఇప్పటికే టీటీడీకి చెందిన పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ఎస్వీబీసీలో కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారని, ప్రస్తుతం తొలివిడతగా రూ.4.20 కోట్లు అందజేశారని చెప్పారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తామన్నారు.


 


 


 


 


 


 


 


 


 


 

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి ఇచ్చింది. ఈ ఏడాదికి మాత్రం అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. ఇదే చివరి అవకాశమని సీజేఐ అన్నారు. 

ఏపీ కేబినేట్ సమావేశం ప్రారంభం... కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ కేబినేట్‌ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి వర్గం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.

సైదాాబాద్ అత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య

సైదాబాద్ బాలిక అత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్ కేసర్ -వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. 

రాజు కోసం పోలీసుల ముమ్మర గాలింపు

సైదాబాద్ బాలిక అత్యాచార నిందితుడి కోసం పోలీసుల ముమ్మర గాలింపు చేపట్టారు. ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద మఫ్టీలో నిఘా పెట్టారు. చివరగా ఉప్పల్‌లో రాజు కనిపించినట్లు తెలుస్తోంది.  నిందితుడిని త్వరగా పట్టుకోవాలని హోంమంత్రి, డీజీపీ ఆదేశాలు ఇచ్చారు.  ఆంధ్రా-తెలంగాణ బోర్డర్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

కడప జిల్లాలో దారుణం... భార్య కాలు, చేయి నరికేసిన భర్త

కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కష్టసుఖాల్లో పాలు పంచుకోవాల్సిన భర్త అనుమానంతో భార్య కాలు, చేయిని కొడవలితో నరికేశాడు. ఈ ఘటన చక్రాయపేట మండలం బీఎన్‌ తండాలో చోటుచేసుకుంది. ఇటీవల భార్యపై అనుమానంతో భర్త వేధింపులు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బుధవారం భార్యభర్తకు మధ్య గొడవ జరిగింది. కోపంతో భార్యపై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె కాలు, చేయి తెగిపడ్డాయి. బంధువులు బాధితురాలిని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. భర్త పరారీలో ఉన్నాడు.

సైదాబాద్ బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు.. రూ.20 లక్షల చెక్కు అందజేత

సైదాబాద్ బాలిక కుటుంబాన్ని తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు రూ.20 లక్షల చెక్కు అందజేశారు. బాధిత కుటుంబానికి 2 పకడ గదుల ఇల్లు ఇస్తామని మంత్రుల హామీ ఇచ్చారు. భారీ బందోబస్తు మధ్య బాలిక కుటుంబాన్ని మంత్రులు పరామర్శించారు. 

శ్రీశైలం డ్యాం రెండు గేట్లు 10 అడుగులమేర ఎత్తివేత

  • కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం రెండు గేట్లు 10 అడుగులమేర ఎత్తివేత

  • ఇన్ ప్లో : 2,20,810 క్యూసెక్కులు

  • ఔట్ ఫ్లో : 1,00,197 క్యూసెక్కులు

  • పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు

  • ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులు

  • పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం : 215 టీఎంసీలు

  • ప్రస్తుత నీటినిల్వ : 212.4385 టీఎంసీలు

  • శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

వైఎస్ షర్మిల దీక్ష భగ్నం

సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై వైటీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ సైదాబాద్‌ పరిధి సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, హత్య చేశాడో మృగాడు. షర్మిల బుధవారం బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించే వరకు కదిలేది లేదని దీక్ష చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి పోలీసులు  వైటీపీ శ్రేణులను చెదరగొట్టి షర్మిల దీక్షను భగ్నం చేశారు. దీక్షాస్థలి నుంచి షర్మిలను తరలించారు. 

Background

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 16న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.