Mudragada Padmanabha Reddy: మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం

వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. కిర్లంపూడిలోని మాజీ మంత్రి ఇంట్లోకి ఏకంగా ట్రాక్టర్​తో దూసుకొచ్చి హల్​చల్​ చేశాడు.

Continues below advertisement

వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి (Mudragada Padmanabha Reddy) నివాసంలో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. కిర్లంపూడిలోని మాజీ మంత్రి ఇంట్లోకి ఏకంగా ట్రాక్టర్​తో దూసుకొచ్చి బీభత్సం సృష్టించాడు. గన్నిశెట్టి గంగాధర్ అనే యువకుడు ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్​తో దూసుకొచ్చి ఆయన ఇంటి గేటును ఢీకొట్టాడు. ఇంటి  కాంపౌండ్‌లో పార్క్​ చేసిన కారును ఢీకొట్టి ధ్వంసం చేశాడు. ఇంటి బయట శబ్దం రావడంతో ఇంట్లో నుంచి బయటకువచ్చిన కుటుంబసభ్యలు అతడిని చూసి భయాందోళనకు గురయ్యారు. జై జనసేన అని అరుస్తూ అక్కడున్న ఫ్లెక్సీలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.. 

Continues below advertisement

దాడి వెనుక ఎవరి హస్తమైనా ఉందా?
తాగుబోతు వీరంగంతో భయాందోళనకు గురైన అక్కడున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ముద్రగడ నివాసానికి చేరుకున్న పోలీసులు గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. మద్యం మత్తులో గంగాధర్ కావాలనే ముద్రగడ నివాసం వద్ద హల్​చల్​ చేశాడా? లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా ఉన్నారా? అనే దానిపై పోలీసులు విచారిన్నారు. సమాచారం తెలుసుకున్న ముద్రగడ అనుచరులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. 

కాపు ఉద్యమనేతగా రాజకీయాలు
టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కీలక నేతగా వ్యవహరించిన ముద్రగడ పద్మనాభం.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో కాపు ఉద్యమ నేతగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఆ పదవి నుంచి తప్పుకున్నారు. కానీ కాపులకు రిజర్వేషన్ల కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వరుసగా లేఖలు రాశారు. 2024 ఎన్నికల సమయంలో మళ్లీ యాక్టివ్​ అయిన ముద్రగడ.. జనసేనలోకి వెళతారని ప్రచారం జరిగింది. అయితే ఆ పార్టీ నుంచి ఆహ్వానం రాకపోవడంతో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, చిరంజీవిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్‌ని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. ఓడిపోవడంతో పద్మనాభరెడ్డిగా మారిపోయారు.

Also Read: Tirumala Stampede: తిరుమలలో తొక్కిసలాట జరిగిన స్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ సభ్యులు

Continues below advertisement