Andhra Pradesh News - ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ - కేటీఆర్ పంతం నెరవేరుతుందా ?
భారత రాష్ట్ర సమితి నుంచి ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ పూర్తయింది.  తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. మంగళవారం జరిగిన విచారణలో  పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలోగా పరిషరించాలని తాము స్పీకర్‌కు గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని దీనిపై మీ వైఖరి ఏమిటో చెప్పాలని అడ్వకేట్‌ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వైఎస్ఆర్‌సీపీకి మరో మాజీ ఎమ్మెల్యే గుడ్ బై - ఈ సారి పిఠాపురం నుంచి ...
ఇటీవలి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్‌సీపీ నుంచి వరుసగా ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోతున్నారు. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా  చేస్తున్నట్లుగా ప్రకటించారు. పిఠాపురంలో ప్రెస్మీట్ పెట్టి వైసీపీలో తనకు ఎదురైన అవమానాలను వివరించారు. వైసీపీలో  తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ ర్యాంకింగ్స్‌ను ఇస్తామని చెప్పిన  గడపగడపకు ప్రచారంలో తానే ముందున్నా నని ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీ హోంమంత్రి అనితతో వైఎస్ సునీత సమావేశం - వివేక కేసు విచారణ అడ్డుకున్న వారిపై చర్యలకు డిమాండ్
వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వైఎస్ సునీత విజ్ఞప్తి చేశారు. ఈ ఉదయం అమరావతిలోని సచివాలయంలో ఏపీ హోంమంత్రి అనితతో సమావేశమైన సునీత ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని న్యాయం చేయాలని అభ్యర్థించారు. హత్య జరిగినప్పటి నుంచి పరిణామాలు మరోసారి హోంమంత్రికి గుర్తు చేశారు సునీత. గత  ప్రభుత్వ హయాంలో పెద్దలు నిందితులకు అండగా నిలిచారని దర్యాప్తునకు అడుగడుగునా అడ్డుపడ్డారని వాపోయారు. దర్యాప్తు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటూనే... ఇప్పటి వరకు విచారణకు అడ్డుపడ్డ వారిపై కూడా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మరో అప్‌డేట్‌- లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లదే
ఎన్నికల హామీలు అమలు చేయడంలో తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచీ అడుగులు వేస్తోంది.ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే...లబ్ధిదారుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలో అతి ముఖ్యమైనది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. గూడులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీ నేరవేర్చుకుంటూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం...తాజా ఇందిరమ్మ ఇళ్లపై దృష్టిసారించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఫ్యూచర్ సిటీ - విదేశాల్లో ముచ్చెర్ల నగరంపై రేవంత్ విస్తృత ప్రచారం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో కొత్త నగరాన్ని నిర్మిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి దాన్నే చూపించి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. ఫ్యూచర్ సిటీని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు దీటుగా అభివృద్ధఇ చేస్తామని చెబుతున్నారు. అత్యాధునిక హంగులతో కాలుష్యానికి, ట్రాఫిక్ సమస్యల్లేకుండా ఈ సిటీ నిర్మించబోతున్నట్టు వారికి వివరిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి