Woman Kidnapped In TN: ఓ ఇంటి గేటును పగులగొట్టి 15 మంది యువకులు మహిళను కిడ్నాప్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిని ఫక్కీలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దుండగులను పట్టుకుని ఆ మహిళను కాపాడారు.
గేటు పగులగొట్టి
తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మైలాడుతురైలోని మహిళ నివాసం ముందు ఉన్న గేటును పగులగొట్టి 15 మంది యువకులు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. ఆమె కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించి మహిళను ఎత్తుకెళ్లారు. ఈ మొత్తం ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది.
సమాచారం అందుకున్న మైలాడుతురై పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. అదే రోజు రాత్రి జాతీయ రహదారిపై కిడ్నాపర్ల కారును అడ్డగించి మహిళను రక్షించారు.
ఎందుకు?
ఈ కిడ్నాప్‌కు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుల్లో ఒకరైన విఘ్నేశ్వరన్ (34) బాధిత మహిళతో పరిచయం పెంచుకొని స్నేహం పేరుతో ఆమె వెంటపడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
విఘ్నేశ్వరన్ వేధింపులతో విసుగెత్తిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకొచ్చి బెదిరించారు. ఇంకోసారి ఇలా చేయకూడదని స్టేట్‌మెంట్ తీసుకొని విడుదల చేశారు. అయితే తనపై కేసు పెట్టిన మహిళపై విఘ్నేశ్వరన్ పగ పెంచుకున్నాడు.
ఒకసారి ట్రై
జులై 12న కొంతమందితో కలిసి మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు విఘ్నేశ్వరన్. ఆమె తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. అయితే మహిళపై మరింత కోపం పెంచుకున్న విఘ్నేశ్వరన్ మరో 14 మంది అనుచరులతో కలిసి మంగళవారం రాత్రి మహిళ ఇంటి తలుపులు బద్దలుకొట్టి ఆమెను ఎత్తుకెళ్లాడు. అదే రోజు రాత్రి పోలీసులు వాహనాన్ని పట్టుకుని మహిళను రక్షించి, విఘ్నేశ్వరన్ సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: China Taiwan News: అమెరికా యాక్షన్‌కు చైనా రియాక్షన్- తైవాన్‌పై ఆంక్షల కొరడా
Also Read: Subramanian Swamy Comments: 'మోదీ మత్తులో మాట్లాడుతున్నారు'- BJP మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు