తమిళనాడులో రాజకీయాలు-సినిమాలను విడదీసి చూడలేం. ఎమ్‌జీఆర్ నుంచి జయలలిత వరకు తమిళ రాజకీయాలను శాసించింది సినీ తారలే. అయితే ఆ జాబితాలోకి కోలివుడ్ ఇలయదళపతి విజయ్ చేరతారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. విజయ్.. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా అన్నారు. కానీ అవేం జరగలేదు.
అయితే విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్.. విజయ్ మక్కల్ మన్రమ్ మాత్రం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సై అంటోందట. అక్టోబర్ 6 నుంచి 9 వరకు మొత్తం 9 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు విజయ్ కూడా సమ్మతించారట. కానీ ప్రచారంలో మాత్రం పాల్గొనని చెప్పినట్లు తెలుస్తోంది.
2021 ఎన్నికల్లో..
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తండ్రి యాక్టర్, డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్.. విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో పార్టీని ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. అయితే ఆ తర్వాత విజయ్.. తాను ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదని బహిరంగంగా ప్రకటించారు.
కానీ ఈసారి అభిమాన సంఘానికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయ్ అనుమతించారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై రాజకీయ విశ్లేషకులు కూడా స్పందిస్తున్నారు.
Also Read:UP Election: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ సమరంలో ప్రియాంక గాంధీ.. సీఎం అభ్యర్థిగా ఫైనల్!
సినీ మయం..
సీఎన్ అన్నాదురై నుంచి దివంగత ఎమ్‌జీ రామచంద్రన్, జే జయలలిత, ఎమ్ కరుణానిధి ఇలా అందరూ తమిళనాడు రాజకీయాలను శాసించిన నేతలు. ప్రస్తుతం కమల్ హాసన్, విజయ్ కాంత్ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. మరి ఈ జాబితాలోకి విజయ్ కూడా చేరతారేమో చూడాలి.
ఇదేం ట్విస్ట్..
అయితే తాజాగా మరో వార్త బయటకి వచ్చింది. అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారంటూ విజయ్.. తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టినట్లు సమాచారం. విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ఆయన తండ్రి పెట్టిన పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్ తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని హీరో విజయ్ గతంలో ప్రకటించారు. కానీ, తల్లిదండ్రులు విజయ్‌పేరుతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, తన పేరు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read:Punjab Political Crisis: కొత్త 'కెప్టెన్ కోసం' కాంగ్రెస్ వేట.. పార్టీకి అమరీందర్ టాటా!