తాలిబన్లు అప్గానిస్థాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అవును పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం తాలిబన్ల బృందం అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయి, మాజీ నెగోషియేటింగ్ కౌన్సిల్ ఛైర్మన్ తో సమావేశమయ్యారు. ఈ తాలిబన్ల బృందానికి అనాస్ హక్కానీ నేతృత్వం వహించారు.


వీరితో పాటు మాజీ ముజాహిద్దీన్ నేతను సైతం కాబూల్ కలిసి ఈ విషయంపై చర్చించారు తాలిబన్ నేతలు.


తాలిబన్లు ఆక్రమించిన తర్వాత అప్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లారు. తాలిబన్ పొలిటికల్ వింగ్ అధినేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఇప్పటికే తాలిబన్లు ప్రకటించారు.


మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయి, హై పీస్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ డా. అబ్దుల్లా, ముజాహిద్దీన్ మాజీ నేత గుల్ బదీన్ హెక్ మటైర్ కాబూల్ వచ్చి తాలిబన్ నేతలతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నట్లు మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి.


ఈ ముగ్గురు నేతలు.. తాలిబన్ నాయకత్వంతో మాట్లాడి ఓ సమగ్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయంగా తాలిబన్ల ప్రభుత్వానికి గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు.


అన్ని పార్టీలనూ కలుపుకొని ఓ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాము కోరుకుంటున్నట్లు తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు.


అయితే తాలిబన్లకు భయపడి ఇప్పటికే చాలా మంది దేశం విడిచివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం తాలిబన్ల అరాచక పాలన చూసిన ప్రజలు మరోసారి ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేమంటున్నారు.


Viral Video: కటౌట్‌ చూసి అన్నీ నమ్మేయొద్దు డ్యూడ్... ఈ బామ్మ ఇంగ్లీష్ వింటే మీరు కూడా నిజమే అంటారు


భయపడుతున్న పక్క దేశాలు..


తాలిబన్లు అధికారం చేపట్టగానే పైకి చెప్పకపోయినా చుట్టుపక్కల దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అక్కడి ఉగ్రవాదం తమ దేశాల్లోకి ఎక్కడ వ్యాపిస్తుందోనని భయపడుతున్నాయి. తాలిబన్ల విషయంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్న చైనా, రష్యాల్లో కూడా అంతర్గతంగా ఈ భయాందోళనలు ఉన్నాయి. పాకిస్థాన్‌ పైకి ఎన్నిచెప్పినా.. అఫ్గాన్‌ సరిహద్దుల్లో యుద్ధప్రాతిపదికన కంచెను నిర్మించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అమెరికా సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్ల రాజ్యం వచ్చేసింది. దీంతో శరణార్థుల సమస్యలు, ఉగ్రవాదం వంటి సమస్యలు పొరుగు దేశాలను భయపెడుతున్నాయి. 


Covid 19 Vaccine for Children: సెప్టెంబర్ నాటికి మార్కెట్ లోకి పిల్లల కరోనా వ్యాక్సిన్!