Covid 19 Vaccine for Children: సెప్టెంబర్ నాటికి మార్కెట్ లోకి పిల్లల కరోనా వ్యాక్సిన్!

ABP Desam   |  18 Aug 2021 06:24 PM (IST)

సెప్టెంబర్ నాటికి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు ఐసీఎమ్ఆర్- ఎన్ఐవీ డైరెక్టర్ ప్రియా అబ్రహం విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ పట్ల ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు.

సెప్టెంబర్ నాటికి పిల్లకు కరోనా వ్యాక్సిన్

పిల్లలకు వచ్చే నెలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్) కు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) డైరెక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు.

2 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలపై ప్రస్తుతం కొవాగ్జిన్ ఫేజ్ 2, 3 ట్రయల్స్ నడుస్తున్నట్లు ప్రియా అబ్రహం వెల్లడించారు. త్వరలోనే ఈ ట్రయల్స్ ఫలితాలు వస్తాయన్నారు. 

త్వరలోనే ఈ ట్రయల్స్ ఫలితాలు రానున్నాయి. ఈ ఫలితాలను రెగులేటర్స్ ముందుఉంచుతాం. సెప్టెంబర్ లేదా ఆ తర్వాత పిల్లల కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.                                           - ప్రియా అబ్రహం, ఎన్ఐవీ డైరెక్టర్

కొవాగ్జిన్ తో పాటు జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ పై కూడా ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. విదేశాల్లో బూస్టర్ డోసుపై పరీక్షలు జరుగుతున్నాయి. ఇందుకోసం కనీసం 7 రకాల వ్యాక్సిన్ లను వినియోగించారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగేందుకు గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం ఈ బూస్టర్ పరీక్షలను నిర్వహించవద్దని తెలిపింది. ఎందుకంటే అధిక ఆదాయ దేశాలకు తక్కువ ఆదాయ దేశాలకు మధ్య వ్యాక్సినేషన్ లో భారీ తేడా ఉంది. కానీ భవిష్యత్తులో ఈ బూస్టర్ డోసులు కచ్చితంగా వస్తాయి.  - ప్రియా అబ్రహం, ఎన్ఐవీ డైరెక్టర్

ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు. కరోనా గురై ఆసుపత్రికి పాలయ్యే కన్నా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయన్నారు. డెల్టా వేరియంట్ సహా అన్ని కరోనా వేరియంట్ల నుంచి టీకా రక్షణనిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కరోనా వేరియంట్ల నుంచి రక్షించుకోవాలంటే వ్యాక్సినేషన్ కీలకం. వేరియంట్లను బట్టి టీకా పనిచేసే సామర్థ్యం తగ్గొచ్చు కానీ కరోనా వల్ల ఆసుపత్రి పాలవడం, మరణించడం వంటి వాటి నుంచి ఇది రక్షిస్తుంది. కనుక వ్యాక్సిన్ వేసుకోవడంలో ఎలాంటి ఆలోచనా వద్దు.                            - ప్రియా అబ్రహం, ఎన్ఐవీ డైరెక్టర్

Nizamabad MP: ఎంపీ ధర్మపురి అర్వింద్ పిల్లలతో ఆడుకున్న మోదీ.. ఫోటోలు వైరల్

Published at: 18 Aug 2021 06:22 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.