Nizamabad MP: ఎంపీ ధర్మపురి అర్వింద్ పిల్లలతో ఆడుకున్న మోదీ.. ఫోటోలు వైరల్
ఎప్పుడూ తీరిక లేకుండా నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో గడుపుతుండే ప్రధాని మోదీ మంగళవారం పిల్లలతో గడిపారు. వాళ్లు ఎవరో కాదు.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమారులు. మామూలుగానే పిల్లలంటే ఇష్టపడే మోదీ, ఎంపీ పిల్లలతో కలిసిపోయి చాలా సేపు ముచ్చటించారు. పిల్లల చదువు వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు. మోదీనే స్వయంగా అర్వింద్ పిల్లలకు స్వీట్లు అందించారు.
ప్రధాని స్థానంలో ఉన్న మోదీ.. తమ పిల్లలు సమన్యు, రుద్రాక్ష్‌తో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేనని ఎంపీ అరవింద్ సంతోషం వ్యక్తం చేశారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సతీసమేతంగా మంగళవారం ప్రధానిని కలిశామని అర్వింద్ ట్వీట్ చేశారు.
చిన్నవాడైన రుద్రాక్ష్‌తో ప్రధాని మోదీ సరదాగా గడిపారని, సమన్యుని తన చదువు, క్రీడలపై ఆసక్తి గురించి వివరాలు తెలుసుకున్నారని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. ‘‘మా 15వ పెళ్లి రోజున (17-08-2021), ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకునే అదృష్టం లభించింది.’’ అని ధర్మపురి అర్వింద్ ట్వీట్ చేశారు.