గేమింగ్ లవర్స్ కోసం రియల్‌మీ సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని పేరు రియల్‌మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్. రియల్‌మీ ఈవెంట్‌లో భాగంగా సంస్థ సరికొత్త ఉత్పత్తులను ఇండియాలో ప్రవేశపెట్టింది. వీటిలో రియల్‌మీ జీటీ సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. రియల్‌మీ జీటీ 5జీ ఫోన్‌తో పాటు మాస్టర్ ఎడిషన్ కూడా మార్కెట్లో విడుదలైంది. రియల్‌మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ 5జీ ప్రాసెసర్‌తో పనిచేయనుంది.
బెస్ట్ గేమింగ్ అనుభవం కోసం ఇందులో జీటీ మోడ్ అందించారు. వ్యాపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ద్వారా 15 డిగ్రీల వరకు టెంపరేచర్ తగ్గించుకునే సదుపాయం ఉంది. దీని వల్ల ఎక్కువ సేపు గేమింగ్ ఆడినా ఫోన్ వేడెక్కకుండా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ రెండు ఫీచర్లు ఇందులో బెస్ట్ అని చెప్పవచ్చు.
రియల్‌మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ బ్యాటరీ కెపాసిటీ 4300 ఎంఏహెచ్‌గా ఉంది. ఇది 65 వాట్స్ సూపర్ డార్ట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో రానుంది. దీని ద్వారా కేవలం 33 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం.. 11 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం చార్జింగ్ ఎక్కుతుందని సంస్థ చెబుతోంది. దీని డిజైన్ సూట్‌కేస్‌ను పోలి ఉంటుంది. నవోటో ఫుకసావా ఈ డిజైన్ రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. లూనా వైట్, కాస్మోస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఇది 120 శాంసంగ్ అమోలెడ్ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లేతో రానుంది.
Also Read: Motorola Edge 20 Fusion: మోటొరోలా నుంచి మిడ్ రేంజ్ ఫోన్.. ఫీచర్లలో మాత్రం తగ్గేదేలే..
మూడు వేరియంట్లలో..
రియల్‌మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25999గా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27999గా ఉంది. హైఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29999గా నిర్ణయించారు. వీటి సేల్ ఆగస్టు 26వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ డాట్ కామ్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.
Also Read: Realme Narzo 30: రియల్‌మీ నార్జో 30లో కొత్త వేరియంట్.. రెండు ఆకర్షణీయమైన రంగులలో లభ్యం
డిస్కౌంట్ ధరకే..
ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ఉన్న వారికి జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ ఫోన్లపై డిస్కౌంట్ లభిస్తుంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18199గా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19599గా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20999గా ఉంది.
మాస్టర్ ఎడిషన్ ఫీచర్లు..
- రియల్‌మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్.. 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో రానుంది.
- 65 వాట్స్ సూపర్ డార్ట్ సపోర్టుతో రానుంది.
- స్క్రీన్ టూ బాడీ రేషియో 91.7గా ఉంది.
- ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
- మాస్టర్ కెమెరాతో ముందుకు రానుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉంటాయి.
- సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
- ఇందులో 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్/ ఏ జీపీఎస్, ఎన్ఎఫ్సీ, వైఫై 6, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.
Also Read: Realme GT 5G: రియల్‌మీ జీటీ 5జీ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లతో ఎంట్రీ