రియల్‌మీ 'ఫ్లాగ్ షిప్ కిల్లర్ ఎడిషన్' అయిన జీటీ సిరీస్ ఇండియాకు వచ్చేసింది. రియల్‌మీ జీటీ 5జీ స్మార్ట్ ఫోన్ బుధవారం భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీంతో పాటు రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్, రియల్‌మీ బుక్ స్లిమ్ కూడా ఇండియాలో విడుదలయ్యాయి. రియల్‌మీ జీటీ 5జీ ఫోన్ హైఎండ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. దీంతో పాటు 65 వాట్స్ సూపర్ డార్ట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆపరేటింగ్ సిస్టంతో ఇది పనిచేయనుంది. డాషింగ్ బ్లూ, డాషింగ్ సిల్వర్, రేసింగ్ ఎల్లో కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఫోన్ వేడిని తగ్గించేలా స్టెయిన్ లెస్ స్టీల్ వ్యాపర్ కూలింగ్ సిస్టం ఇందులో ఉంటుంది.
రెండు వెర్షన్లలో..
రియల్‌మీ జీటీ 5జీ రెండు వెర్షన్లలో అందుబాటులోకి రానుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37999గా, 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41999గా ఉంది. ఈ ఫోన్ల సేల్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మీ డాట్ కామ్, ఫ్లిప్ కార్ట్ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు మాత్రమే ఆగస్టు 25 నుంచి సేల్‌కు రానున్నాయి. 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను తర్వాత విడుదల చేయనుంది.
ఈ ఫోన్ అమ్మకాల కోసం రియల్‌మీ.. ఫ్లిప్ కార్టుతో జతకట్టింది. ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ ఉన్న వారికి ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్ వస్తుంది. వీరికి 30 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ ఉన్న వారికి 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.26599కి, 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.29,399కి అందించనుంది.
రియల్‌మీ జీటీ 5జీ ఫీచర్లు..
- రియల్‌మీ జీటీ 5జీ.. 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో రానుంది.
- రిఫ్రెష్ రేట్ 120Hz గా, టచ్ శాంప్లింగ్ రేట్ 360Hzగా ఉండనుంది.
- స్క్రీన్ టూ బాడీ రేషియో 91.7గా ఉంది.
- ఇది ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేయనుంది.
- ఇందులో వెనుక వైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ అందించారు.
- సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
- ఇందులో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.
- దీని బరువు 186.5 గ్రాములుగా ఉంది.
Also Read: Motorola Edge 20 Fusion: మోటొరోలా నుంచి మిడ్ రేంజ్ ఫోన్.. ఫీచర్లలో మాత్రం తగ్గేదేలే..