Sudoku Maki Kaji Passes Away: మెదడుకు మేత అంటూ మనం ఎన్నో పజిల్స్, పద వినోదాలు, ఇతరత్రా వాటితో పాటు ఫేమస్ అయిన పజిల్ సుడోకు.  ఆ పజిల్​ సృష్టికర్త మాకీ కాజీ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 69 ఏళ్లు కాగా గత కొంతకాలం నుంచి క్యాన్సర్ సమస్యతో సతమతమయ్యారు. సుడోకు గాడ్‌ఫాదర్‌గా మాకా కాజీని వ్యవహరిస్తారు. ప్రపంచంలోని పలు దేశాలలోని చిన్నారులు, విద్యార్థులకు మాకీ కాజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.


తొమ్మిది నిలువు, అడ్డం గడులతో నెంబర్ల పజిల్స్ ఆయన సుడోకు తయారుచేసి పజిల్స్‌లో కొత్త ఒరవడి తీసుకొచ్చారు.  యూనివర్సిటీ డ్రాపౌట్ అయినా.. స్వశక్తితో ఎదిగిన వ్యక్తి మాకీ కాజీ. జపాన్‌లో తొలి పజిల్ మ్యాగజైన్‌ను తీసుకొచ్చి కొత్త తరహా పనులకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 8, 1951న జపాన్‌లోని సపోరోలో మాకీ కాజీ జన్మించారు. ఆయన తండ్రి ఓ టెలికాం కంపెనీలో ఇంజనీర్ కాగా, తల్లి ఓ షాపులో పని చేశారు. చిన్ననాటి నుంచి కాజీకి చదువుపై అంతగా ఆసక్తి ఉండకపోయేది.
Also Read: Gandhi Hospital Case: మిస్టరీగా గాంధీ హాస్పిటల్ గ్యాంగ్ రేప్ వ్యవహారం.. కేసులో మరో ట్విస్ట్


రాజధాని టోక్యోలో స్కూలు, ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేశారు. గ్రాడ్యుయేషన్ మధ్యలోనే మానేసిన మాకీ కాజీ మొదట ఓ ప్రింటింగ్ కంపెనీలో చేరారు. ఆపై ఆయన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. నెంబర్లపై ఆయనకు ఆసక్తి పెరగింది. ఈ క్రమంలో 1980 దశకంలో పజిల్స్ విధానం మొదలుపెట్టారు. అనతికాలంలో సుడోకు పజిల్స్‌తో మ్యాజిక్ చేశారు.


1984లో నికోలి మ్యాగజైన్​లో కొత్త పజిల్స్‌ను ప్రవేశపెట్టాడు. అయితే కొన్నేళ్లవరకు మాకీ కాజీ కొత్త పజిల్ విధానానికి గుర్తింపు దక్కలేదు. రిటైర్డ్ న్యాయమూర్తి ఈ నెంబర్ పజిల్స్‌‌ను 1997లో చూశారు. దానికి సుడోకు అని నామకరణం చేశారు. జపాన్ భాషలో సుడోకు అంటే ఒక్క అంకె అని అర్థం. పదేళ్ల తరువాత చిన్నారులకు సరళంగా ఉండేలా సుడోకు పజిల్స్ తయారు చేశాడు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఈ సుడోకు పజిల్స్ ప్రాక్టీస్ చేయించేవారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ల మంది క్రమం తప్పకుండా ఈ సుడోకు పజిల్స్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. 
Also Read: శశి థరూర్‌కు భారీ ఊరట.. సునంద పుష్కర్ హత్య కేసులో కాంగ్రెస్ ఎంపీపై అభియోగాలు కొట్టివేసిన కోర్టు


ఈ పజిల్స్ తక్కువ సమయంలో పూర్తి చేయడానికి కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేశారు. పలు దేశాల్లో సుడోకు పజిల్స్‌పై పోటీలు జరిగేవి. ఆన్‌లైన్ లో విద్యార్థులు వీటిని ప్రాక్టీస్ చేస్తూ తమ మైండ్ పవర్‌ను పెంచుకునేవారు. సుడోకు గాడ్‌ఫాదర్ మాకీ కాజీ కొన్నేళ్ల కిందట బైల్ డక్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కంపెనీ నికోలీ సోమవారం నాడు తమ వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఆయన సేవల్ని స్మరించుకున్నారు. 
Also Read: Medak: చికెన్‌ కర్రీతో అన్నం తిని పడుకున్న చిన్నారులు.. పొద్దునే లేచి చూస్తే షాక్! తీవ్ర విషాదం..