రియల్‌మీ నార్జో 30 స్మార్ట్ ఫోన్‌ నుంచి కొత్త వేరియంట్ రిలీజ్ అయింది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ భారత మార్కెట్లోకి విడుదల అయింది. ఇప్పటికే రియల్‌మీ నార్జో 30లో 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉండగా.. తాజాగా కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చారు. రియల్‌మీ నార్జో 30లో ట్రిపుల్ కెమెరా సెటప్, సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్‌ అందించారు. ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. కొత్త వేరియంట్ రేసింగ్ బ్లూ మరియు రేసింగ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 



రూ.14 వేల లోపు ధరలోనే.. 
రియల్‌మీ నార్జో 30లో 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా.. కొత్తగా వచ్చిన 6 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,499గా ఉంది. హైఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.14,499గా ఉండనుంది. వీటిలో రెండు వేరియంట్లు ఇప్పటికే లాంచ్ అవ్వగా.. కొత్తగా విడుదలైన (6 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్) వేరియంట్ ఫోన్ల సేల్ ఈ రోజు (ఆగస్టు 5) నుంచి ప్రారంభం కానుంది. దీనిని రియల్‌మీ ఇండియా వెబ్ సైట్, ఇతర రిటైల్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. 


Also Read: Realme 8i, 8s Launch India: రియల్‌మీ 8 సిరీస్ కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి..


రియల్‌మీ నార్జో 30 స్పెసిఫికేషన్లు.. 
డ్యుయల్ సిమ్ (నానో) రియల్‌మీ నార్జో 30 ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0తో పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను (1,080x2,400 పిక్సెల్స్) అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 Hz కాగా.. స్క్రీన్ టు బాడీ రేషియో 90.5 శాతంగా ఉన్నాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ95 (SoC) ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను (256 జీబీ వరకు) పెంచుకునే సౌకర్యాన్ని కల్పించారు. 



ఇందులో వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. ప్రైమరీ కెమెరా కెపాసిటీ 48 మెగాపిక్సెల్ కాగా.. 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌‌ను కూడా అందించారు. అయితే దీన్ని ఫోన్ పక్క భాగంలో అమర్చారు.


5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని అందించారు. దీంతో పాటుగా 30 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని ద్వారా 25 నిమిషాల్లోనే.. 50 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.  అలాగే 100 శాతం చార్జింగ్ 65 నిమిషాల్లోనే ఎక్కుతుందని వెల్లడించింది.



కనెక్టివిటీ ఫీచర్లుగా..  డ్యూయల్ 4జీ ఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉండనున్నాయి. లైట్ సెన్సార్, ప్రొక్సిమిటీ సెన్సార్, మాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్, గైరో సెన్సార్లు ఇందులో ఉంటాయి. ఈ ఫోను 192 గ్రాములు బరువు ఉంటుంది.


Also Read: iQoo 8 Series Launch: ఐకూ నుంచి కొత్త సిరీస్.. రిఫ్రెష్ రేట్‌ 120 Hz.. లాంచ్ ఎప్పుడంటే..