Tahawwur Rana Was Declared Deserter By Pak Army: అమెరికా నుంచి భారత సైన్యం తీసుకు వచ్చిన తహవూర్ రాణా విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్‌గా పనిచేశానని ఒప్పుకున్నాడు. ముంబై దాడుల సమయంలో తాను ముంబైలోనే ఉన్నానని, దాడులకు సంబంధించిన రెక్కీ (రక్షణ) కార్యకలాపాల్లో పాల్గొన్నానని చెప్పినట్లు సమాచారం తహవూర్ హుస్సేన్ రాణా, 26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో ప్రధాన నిందితుడు. ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కస్టడీలో ఉంటూ ముఖ్యమైన వివరాలను వెల్లడించారు.
తహవూర్ రాణా, తన సన్నిహిత సహచరుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో కలిసి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా (LeT) నుండి శిక్షణ పొందాడు. ఈ సంస్థ ప్రధానంగా గూఢచర్య నెట్‌వర్క్‌గా పనిచేస్తుందని తెలిపినట్లుగా తెలుస్తోంది. దాడులకు ముందు రాణా ముంబైలోని కీలక ప్రదేశాలైన ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CST) వంటి స్థలాలను స్వయంగా రెక్కీ చేశానని ఒప్పుకున్నాడు. ఈ రెక్కీ ద్వారానే దాడులకు ప్రణాళిక వేసినట్లుగా అంగీకరించాడు. ముంబైలో తన సంస్థకు సంబంధించిన సెంటర్‌ను ఏర్పాటు చేయడం తన ఆలోచన అని, దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను వ్యాపార ఖర్చులుగా రికార్డ్ చేశానని రాణా తెలిపాడు. ఈ సెంటర్‌ను హెడ్లీ ఉగ్ర కార్యకలాపాలకు కవర్‌గా ఉపయోగించానని తెలిపారు.
గల్ఫ్ వార్ సమయంలో సౌదీ అరేబియాకు రహస్య కార్యకలాపాల కోసం వెళ్లానని కూడా చెప్పాడు. ఇది పాకిస్థాన్ సైన్యంతో అతని సంబంధాలను మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు. రాణా ఢిల్లీలోని తీహార్ జైలులో ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. ఆయనను ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం విచారిస్తోంది. రాణా మొదట్లో విచారణలో సహకరించలేదు . అస్పష్టమైన సమాధానాలు ఇచ్చాడు. అయితే, తరువాతి విచారణల్లో మెల్లగా అన్ని విషయాలు బయట పెట్టడం ప్రారంభించాడు. ఈ వివరాలు అధికారికంగా ఎన్ఐఏ ధృవీకరించలేదు. రాణా వాంగ్మూలం లష్కర్-ఏ-తోయిబా , పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో అతని సంబంధాలను, అలాగే ముంబై దాడుల ప్రణాళికలో అతని పాత్రను మరింత స్పష్టం చేయడంలో కీలకమైనదిగా భావిస్తున్నారు.