Toyota Glanza Price, Down Payment, Loan and EMI Details: బలమైన బాడీతో వచ్చే టయోటా కార్లను భారతదేశంలో బాగా ఇష్టపడతారు. ఈ కంపెనీ తీసుకొచ్చిన అత్యంత చవకైన కారు టయోటా గ్లాంజా. ఈ ఫోర్‌వీలర్‌ ఎక్స్-షోరూమ్ ధర (Toyota Glanza ex-showroom price) రూ. 6.90 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. మీరు ఈ కారును కొనాలనుకుంటే ఒకేసారి పూర్తి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కారును డౌన్ పేమెంట్ & EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. 

హైదరాబాద్‌ లేదా విజయవాడ లేదా మరేదైనా తెలుగు నగరంలో టయోటా గ్లాంజా ఆన్-రోడ్ ధర (Toyota Glanza on-road price) దాదాపు రూ. 8.33 లక్షలు. మీరు రూ. లక్ష డౌన్ పేమెంట్‌తో ఈ బండిని కొనుగోలు చేస్తే, బ్యాంక్‌ నుంచి మీకు రూ. 7.33 లక్షల వరకు రుణం వస్తుంది. బ్యాంక్‌ ఈ కార్‌ లోన్‌ మీద 9 శాతం వడ్డీ వసూలు చేస్తుందని అనుకుందాం. ఇప్పుడు, టయోటా గ్లాంజా పూర్తి ఫైనాన్స్ ప్లాన్ వివరాలు చూద్దాం.

ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి? 

7 సంవత్సరాల కాలానికి మీరు ఈ రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 11,793 EMI చెల్లించాలి.       

6 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే నెలకు రూ. 13,213 EMI బ్యాంక్‌లో జమ చేయాలి.     

5 సంవత్సరాల రుణ కాల పరిమితి పెట్టుకుంటే నెలనెలా రూ. 15,216 EMI చెల్లించాలి.          

4 సంవత్సరాల కాలం కోసం మీరు కార్‌ లోన్‌ తీసుకుంటే, ప్రతి నెలా రూ. 18,241 EMI చెల్లించాలి.           

మీ జీతం రూ. 30,000 నుంచి రూ. 40,000 మధ్యలో ఉంటే ఈ టయోటా కారు మీకు సరైన ఆప్షన్‌ అవుతుంది. మీరు రూ. లక్ష డౌన్‌ పేమెంట్‌ చేసి, 6 లేదా 7 సంవత్సరాల EMI ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. 

బ్యాంక్‌ మంజూరు చేసే లోన్ మొత్తం, వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ, బ్యాంక్‌ పాలసీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

టయోటా గ్లాంజాలో అదిరిపోయే ఫీచర్లుపిట్ట కొంచం, కూత ఘనం అన్నట్లుగా, టయోటా గ్లాంజా ధర తక్కువ అయినప్పటికీ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లలో ఎలాంటి లోటు లేదు. ఈ కారులో... 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్‌ AC వెంట్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, పుష్ బటన్ స్టార్ట్‌తో కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్‌, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి, సాధారణంగా ఇవి ప్రీమియం కార్లలో కనిపిస్తుంటాయి. మల్టీ-ఇన్ఫో డిస్‌ప్లేతో అనలాగ్ డయల్ వంటి ఫీచర్లను కూడా టయోటా గ్లాంజాలో చూడవచ్చు.

టయోటా గ్లాంజా సేఫ్టీ ఫీచర్లు - 6 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్‌ పార్కింగ్ సెన్సార్ & హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి అత్యాధునిక భద్రత సాంకేతికతలు ఈ కారులో ఉన్నాయి.