What To Do When Lost Aadhar Card: ఆధార్ కార్డు అన్నింటికి ముఖ్యమైపోయింది. బ్యాంకు లావాదేవీల నుంచి పిల్లల చదువులుతోపాటు టూర్‌లకు వెళ్లాలన్నా సరే ఆధార్‌ మస్ట్. అందుకే ఆధార్‌ జేబులో పెట్టుకోవడం చాలా అవసరం. అలాంటి ఆధార్‌ ఎక్కడైనా పెట్టి మార్చిపోవడమో లేదా, ఎవరైనా దొంగిలిచడమో చేస్తే ఏం చేయాలి. ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాల్సిందేనా అంటే ఆ అవసరం లేదు. ఇంట్లోనే మీ మొబైల్, లేదా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ ఉపయోగించి ఆధార్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. 

ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రతి భారతీయుడికి అత్యవసరమైన గుర్తింపు కార్డు. బ్యాంకింగ్ , ప్రభుత్వం సేవలు, రేషన్, పాన్, మొబలైన కనెక్షన్ ఇలా అన్నింటికీ ఆధార్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అలాంటి ఆధార్ పోయిందంటేచాలా మందికి కంగారు మొదలవుతుంది. అలా కంగారు పడాల్సిన పని లేదు. ఇంట్లోనే నిశ్చింతగా మరో కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అలా ఎలా అప్లై చేయాలో స్టెప్‌బై స్టెప్‌ ఇక్కడ చూద్దాం. 

ఆధార్ నెంబర్‌ లేదా ఎన్రోల్‌మెంట్‌ ఐడీ పొందడం ఎలా?(How To Get Aadhaar Number With Enrollment Id)

మీరు కచ్చితంగా మీ ఆధార్ కార్డు నెంబర్‌ లేదా ఎన్రోల్‌మెంట్‌ స్లిప్‌ నెంబర్‌ను గుర్తు పెట్టుకోవాలి. 

ఇవి గుర్తు లేవు అంటే UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో రిట్రైవ్‌ లాస్ట్‌ లేదా ఫర్గాటెన్ EID/UID ఆప్షన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 

ఆ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడుగుతారు. అక్కడ నెంబర్ టైప్ చేసి క్యాప్చా ఇచ్చి సబ్‌మిట్ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డు తెలిసిపోతుంది. 

ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం (e- Aadhaar)ఎలా?(How To Download e-aadhaar online)

ఆధార్ కార్డు పోతే మీ వద్ద కచ్చితంగా e- ఆధర్‌ కార్డును ఉంచుకోవాలి. దాన్ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూద్దాం. 

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 

అందులో డౌన్‌లౌడ్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. 

అందులో మీ ఆధార్ నెంబర్ లేదా ఈఐడీ ఎంటర్ చేయాలి

దాని కింద క్యాప్చా కోడ్ వస్తుంది దాన్ని కూడా ఎంటర్ చేయాలి. 

వెంటనే ఓటీపీ కోసం క్లిక్ చేయాలి. మీరు ఆధార్‌ నమోదు టైంలో ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలియ 

వెరిఫై అయిన తర్వాత ఈ ఆధార్‌ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఈ ఆధార్‌ పీడీఎఫ్‌ రూపంలో వస్తుంది. దానికి ఓ పాస్‌వర్డ్ ఉంటుంది. 

పాస్‌వర్డ్ ఏంటంటే:-మీరు పేరులో మొదటి నాలుగు అక్షరాలు(క్యాపిటల్ లెటర్స్‌లో), తర్వాత పుట్టిన సంవత్సరం పూర్తిగా రాయాలి. ఉదాహరణకు RAJU 2001 అని ఎంటర్ చేయాలి. 

e- ఆధార్‌ డిజిటర్ కాపీ ఎక్కడైనా నార్మల్ ఆధార్‌ మాదిరిగానే చెల్లుబాటు అవుతుంది. 

ఆధార్ కార్డు పీవీసీ కార్డు ఆర్డర్ చేయడం ఎలా ?(How To Order Aadhar PVC Card?)

మొదట UIDAIవెబ్‌సైట్‌లో ఆర్డర్‌ ఆధార్ పీవీసీ కార్డు అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. 

మీ ఆధార్ నెంబర్‌ లేదా ఈఐడీ ఎంటర్ చేయాలి. 

ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాలి. 

నామమాత్రపు ఫీజు(రూ. 50)ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. 

ఆర్డర్ చేసిన పీవీసీ ఆధార్ కార్డు మీ ఆడ్రెస్‌కు పోస్టు ద్వారా వస్తుంది. 

ఆధార్ కార్డు స్టేటస్ చెక్ చేయడం ఎలా ?(How To Check Aadhaar PVC Order Status?)

ఆధార్‌ కార్డు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ ఆధార్ పీవీసీ కార్డు స్టేటస్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేసి మీ పీవీసీ కార్డు స్టేటస్ చెక్ చేయవచ్చు. అప్డేట్‌ లేదా మార్పులు కావాలంటే ఏం చేయాలి 

మీ ఆధార్‌లో చిరునామా, ఫోన్ నెంబర్, ఫొటో, ఇతర వివరాల్లో మార్పులు చేర్పులు కావాలంటే అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మార్పులు చేర్పులు చేయవచ్చు. ఇక్కడ కేవలం చిరునామా మార్పు మాత్రమే మీరు సొంతగా చేయగలరు.

మిగతా మార్పులు చేయాలంటే మాత్రం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.