Haridwar News: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని పతంజలి విశ్వవిద్యాలయంలో హోళికోత్సవ్ యజ్ఞం, పుష్ప హోలీ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ విశ్వవిద్యాలయానికి చాన్సలర్ గా ఉన్న యోగా గురు బాబా రాంందేవ్, వైస్ చాన్సలర్ ఆచార్య బాలకృష్ణ పాల్గొన్నారు. యోగా గురు స్వామి రాందేవ్ దేశ ప్రజలందరికీ వసంత పంచమని శుభాకాంక్షలు తెలిపారు, యోగా, యజ్ఞం మన సనాతన ధర్మానికి జీవనాడి అని పేర్కొన్నారు.
చెడుపై మంచి విజయానికి చిహ్నం హోలీ
హోళి రంగుల పండుగ మాత్రమే కాదు, సామాజిక సామరస్యం, ప్రేమ, సోదరభావం , చెడుపై మంచి విజయానికి చిహ్నం కూడా అని బాబా రాందేవ్ అన్నారు. స్వీయ నింద, స్వీయ మతిమరుపు, స్వీయ హిప్నాసిస్ మొదలైన వాటిని హోలీ పండుగ రోజు వదిలేద్దామని సంకల్పించుకుందామని పిలుపునిచ్చారు. సత్యంలో స్థిరంగా ఉండి, మన సత్య మార్గంలో, సనాతన మార్గంలో, వేద మార్గంలో, ఋషుల మార్గంలో, సత్వ మార్గంలో, కొత్త శిఖరాలను అధిరోహిస్తూ, ఆరోహణను సాధిస్తూ ముందుకు సాగుదామని బాబా రాందేవ్ పిలుపునిచ్చారు.

ప్రతి పండుగను యోగా, యజ్ఞంతో జరుపుకోవడం సనాతన ధర్మం
తాము సనాతన ధర్మం లో ప్రతి పండుగను యోగా , యజ్ఞంతో జరుపుకుంటామని బాబా రాందేవ్ తెలిపారు. యోగా, యజ్ఞాలు మన సనాతన ధర్మం జీవనాడి అని తెలిపారు. హోలీ పండుగల రోజు మత్తుపానియాల ద్వారా ఈ విశిష్టతను చెడగొట్టవద్దని రామ్ దేవ్ దేశవాసులను కోరారు. ఇవి సమాజానికి హానికరమన్నారు. హోలీ అహాన్ని విడిచిపెట్టే పండుగ అని పతంజలి యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ఆచార్య బాలకృష్ణ అన్నారు. హోలికలో మన అంతర్గత లోపభూయిష్ట భావోద్వేగాలను దహనం చేసే పండుగ అన్నారు. హోలీ రోజున, మనలోని అన్ని దుష్టగుణాలను మరచిపోయి, సోదరభావం యొక్క రంగులతో మనల్ని మనం అలంకరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ పవిత్ర పండుగను అర్థవంతంగా చేసుకుందామన పిలుపునిచ్చారు. హోలీని పూర్తి సత్వభావంతో జరుపుకోవాలని ఆచార్య బాలకష్ణ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సత్యభావంతో హోలీ జరుపుకోవాలి : ఆచార్య బాలకృష్ణ
హోలీ రోజున రసాయన రంగులను ఉపయోగించవద్దని పువ్వులు , మూలికా గులాల్‌తో మాత్రమే హోలీ ఆడాలని సూచించారు. రసాయన రంగులు కంటి , చర్మ వ్యాధులకు కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఆచార్య బాలకృష్ణ హోలీ ఆడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హోలీ ఆడే ముందు, మీ శరీరంలోని బహిర్గత భాగాలకు ఆవాలు లేదా కొబ్బరి నూనె లేదా కోల్డ్ క్రీమ్ రాసుకోవాలన్నారు. ఇది హానికరమైన రసాయన రంగులతో చర్మం దెబ్బతినే అవకాశాలను తగ్గిస్తుందని తెలిపారు.
పతంజలి విశ్వవిద్యాలయంలో జరిగిన హోలీ వేడుకల్లో ఉద్ోయగులు, యూనిట్ అధిపతులు, విభాగాధిపతులు, పతంజలి సంస్థతో సంబంధం ఉన్న అన్ని యూనిట్ల ఉద్యోగులు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు.