Seethe Ramudi Katnam Serial Today Episode మిధునకు కాల్ రావడంతో మాట్లాడుతూ పక్కకు వెళ్తుంది. మిధున  అచ్చం మోడ్రన్ సీతలా ఉందని జనార్థన్ వాళ్లు అనుకుంటారు. దానికి మహాలక్ష్మీ మేం అలాగే కన్ఫ్యూజ్ అయ్యామని కానీ ఇద్దరూ వేరు అని అంటుంది. రామ్ తండ్రితో సీత ఇప్పటి వరకు చాలా గెటప్‌లు వేసింది ఇప్పుడు ఈ మిధున గెటప్ వేసింది. తను  సీతో మిధునో ఇప్పుడే తేల్చేస్తా అని మిధున వెనకాలే వెళ్తాడు.


ఫోన్‌లో మాట్లాడుతున్న మిధునని సీత అని వెళ్లి హగ్ చేసుకుంటాడు. మిస్టర్ లీవ్ మీ లీవ్ మీ అని మిధున అరుస్తుంది. గెటప్ మార్చితే గుర్తు పట్టలేను అనుకున్నావా నీ వేషాలు నా దగ్గర కాదు నువ్వు సీతే అని నాకు తెలుసు అని రామ్ అంటాడు. దానికి మిధున నువ్వు మంచోడివి అనుకుంటే ఇలా డర్టీగా ప్రవర్తించావేంటి ఇలాగే పెంచారా అని తిడుతుంది. రామ్ ఎన్ని సార్లు చెప్పినా మిధున వినకుండా రామ్‌ని అందరి ముందుకు లాక్కెళ్తుంది. తండ్రితో రామ్ నన్ను హగ్ చేసుకున్నాడని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. 


గౌతమ్‌, మిధున తల్లిదండ్రులు రామ్‌ మీద సీరియస్ అవుతారు. రామ్ సారీ చెప్తాడు. రామ్ ఎవరితో ఇలా ప్రవర్తించడు క్షమించండి అని మహాలక్ష్మీ, జనార్థన్ ముఖర్జీకి సారీ చెప్తారు. గౌతమ్ మాత్రం ఓవర్ చేస్తాడు. అర్చన మనసులో వీడేంటి ఇంత ఓవర్ చేస్తున్నాడు అనుకుంటుంది. రామ్ మిధున దగ్గరకు వెళ్లి మరోసారి సారీ చెప్తాడు. మిధున క్షమిస్తున్నా అంటే అలా ఎలా క్షమిస్తారు రామ్‌ని శిక్షించండి అని అంటాడు. మిధునకు సీతకి పోలిక ఏంటి సోడాబుడ్డి కళ్లాద్దాలు, పళ్లకు క్లిప్, వచ్చీ రాని ఇంగ్లీష్ అని అంటే దానికి మిధున అడవాళ్లని కించపరిస్తే ఊరుకోను అని గౌతమ్‌ని తిడుతుంది. ఇక సీతని చూడాలని ఉందని మిధున అంటే గౌతమ్ పిలుస్తా అంటాడు. మహాలక్ష్మీ గౌతమ్‌ని ఆపి రామ్ మిధునని హగ్ చేసుకున్నాడని సీతకి తెలిస్తే రామ్ తోలు ఒలిచేస్తుంది. 


మిధున భర్త్‌డే వేడుకలు జరుగుతాయి. మిధున కేక్ కట్ చేసి తల్లిదండ్రులకు మహాలక్ష్మీ, జనార్థన్‌లకు తినిపిస్తుంది. రామ్ వచ్చి మిధునకు హ్యాపీ భర్త్‌డే  చెప్పి కేక్ చేతికి ఇస్తాడు. మిధున తీసుకొని థ్యాంక్స్ చెప్పి కేక్ తింటుంది. ఇక గౌతమ్ కేక్ తినిపించబోతే మిధున ఆపి తీసుకుంటుంది. మహాలక్ష్మీ ఫ్యామిలీ మొత్తం ముఖర్జీ ఫ్యామిలీకి చెప్పి బయల్దేరుతారు. ఇక వీళ్లు వెళ్లిపోయారు కదా సీతని పిలుద్దామని ముఖర్జీ అంటారు. వెళ్తూ వెళ్తూ రామ్ మిధునని చూడటం మిధున కూడా రామ్‌ని చూస్తుంది. బయటకు వెళ్లి రామ్, గౌతమ్ గొడవ పడతారు. మిధున నీ భార్య కాదు అంటే నీ భార్య కాదు అని అనుకుంటారు. అసలు సీత ఉందో లేదో చూద్దాం అని మహాలక్ష్మీ అంటుంది. దాంతో సీత అక్కడికి వస్తుంది. నేను మామ రాజీ పడం అని అనుకుంటున్నారా అత్త అని సీత అంటే నువ్వు పడతావ్ కానీ రామ్‌ పడడు అని అంటుంది. సీత రామ్‌ని పట్టుకోవడానికి హగ్ చేసుకోవడానికి వస్తే రామ్‌  ముట్టుకోవద్దని అంటాడు. ఇక అందరూ సీతకి మిధున గురించి చెప్తారు. ఇక అర్చన రామ్‌ మిధునని హగ్ చేసుకున్నాడని చెప్తుంది. 


సీత నాకు అన్యాయం చేస్తావా మామ అని రచ్చ మొదలు పెడుతుంది. గౌతమ్ సీతని రెచ్చ గొడతాడు. రామ్ సీతతో అమ్మా తల్లీ నువ్వు అనుకొని పట్టుకున్నా సారీ చెప్పా అని అంటే దానికి సీత నాకు సారీ చెప్పు అని అంటుంది. గొడవ వద్దు అని జనార్థన్ అంటే సీత నా మొగుడితో సారీ చెప్పించుకుంటుందా దాని పని చెప్తా అని హల్ చల్ చేస్తుంది. మిధునతో గొడవ పడొద్దు అని రామ్ అంటే దానికి గౌతమ్ సీత మిధునతో గొడవ పడితే నీకు ఏంటి బాధ అని పుల్లలు పెడతాడు. ఇక గొడవ వద్దని జనార్థన్ అందర్నీ తీసుకెళ్లిపోతాడు. సీత లోపలికి వెళ్లి ముఖర్జీ ఆయన భార్య కాళ్ల మీద పడి మీ కూతురి మిధున పేరు ఇచ్చారు తనలా రెడీ చేసి నాకు ఆ స్థాయి ఇచ్చారు థ్యాంక్యూ అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!