Trending
NCP Leader Supriya Sule: ట్రాఫిక్ పోలీస్‌గా మారిన పవార్ కుమార్తె- వీడియో చూశారా?
NCP Leader Supriya Sule: ఎన్‌సీపీ నేత, ఎంపీ సుప్రియా సూలే.. ట్రాఫిక్ పోలీసు అవతారమెత్తారు.
Continues below advertisement
(Image Source: Twitter)
NCP Leader Supriya Sule: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియ సూలే ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారారు. అవును మహారాష్ట్రలోని పుణెలో ఆమె ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కష్టపడ్డారు.
Continues below advertisement
ఇదీ జరిగింది
పుణెలో ఎన్‌సీపీ నేత సుప్రియ సూలే ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. ఎంతసేపటికీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ఆమె కారు దిగారు. ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. ఆమె వాహనదారులతో మాట్లాడుతూ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు.
హడప్సర్ నుంచి సస్వద్ వరకు ఉన్న పల్ఖి హైవేకు ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంది. ఈ రోడ్డుపై నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటోంది. ఈ రోడ్డు దుస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ రోడ్డు మరమ్మతు పనులను తక్షణమే చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేస్తున్నాను. - సుప్రియ సూలే, ఎన్‌సీపీ నేత
Also Read: Traffic Fines in Karnataka: కారులో వెళ్తున్నారా? ఒకసారి ఇది చెక్ చేయండి- లేకుంటే రూ.1000 ఫైన్!
Continues below advertisement