AP CRDA :   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ..  సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్‌ రీజియన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టాల సవరిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. ఇప్పుడు ఆ బిల్లును  ఆమోదముద్ర వేస్తున్నట్లు తెలుపుతూ గవర్నర్‌ పేరిట నోటిఫికేషన్‌ జారీ  లఅయింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇళ్ల పథకాలు రాజధాని ప్రాంతంలోని వారికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లోని అర్హులకు కూడా కేటాయించేలా కొద్దినెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.  ఈ విషయంలో సంబంధిత పాలకవర్గంతో పాటు ప్రత్యేకాధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్టాన్ని సవరించింది దీంతో పాటు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు.


రాజధానికి రైతులిచ్చిన భూములు ఎవరికైనా ఇచ్చేలా చట్టసవరణ 


అయితే ఈ చట్టం కోర్టు తీర్పునకు విరుద్దంగా ఉందని అమరావతి రైతులు వాదిస్తున్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణం కోసం ఎంతోమంది రైతులు ఇచ్చిన భూములకు సీఆర్‌డీఏ సంరక్షకురాలిగా ఉంది. రాజధాని రైతులతో ప్రభుత్వం ఏపీ సీఆర్‌డీఏ-2014 ఒప్పందం  చేసుకుంది. దీన్నే చట్టంగా రూపొందించారు.  సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 41(1), 41(3), 2(22), 53(1)ల ద్వారా భూములకు రక్షణ  కల్పించింది.  రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు మాత్రమే ఇళ్లు కట్టివ్వాలని సీఆర్డీఏ చట్టంలో ఉంది. అమరావతిలో భూములను ఇష్టానుసారం పంచడానికిగానీ అమ్మడానికిగానీ వీలు ఉండదు.  దీనికి భిన్నంగా ప్రస్తుత చట్ట సవరణ ఉంది.


రాజధాని అవసరాలకు మాత్రమే మార్చాలని ఇప్పటి వరకూ సీఆర్డీఏ చట్టం


సీఆర్డీఏ చట్టంలో ఉన్న దాని ప్రకారం  కేవలం రాజధాని భూసమీకరణలో భాగంగా రైతులు ఇచ్చిన భూముల్ని మాత్రమే ఇతరులకు ఇవ్వకూడదు. ఇతర ప్రభుత్వ భూముల్ని ఎవరికైనా కేటాయించవచ్చు. కానీ ప్రస్తుత చట్ట సవరణ ద్వారా రైతులు ఇచ్చిన భూముల్ని కూడా మాస్టర్ ప్లాన్‌లో కీలకమైన నిర్మాణాలకు కేటాయించిన ప్రాంతాన్ని ఇతరులకు ఇచ్చేందుకు అవకాశం కల్పించుకుంది. నిజానికి గతంలోనే ఇలాంటి ప్రయత్నాలను హైకోర్టు క౧ట్టి వేసింది.  సీఆర్డీఏ పరిధిలోని 500 ఎకరాలను గుంటూరు, విజయవాడలోని   ఇంటి పట్టాల పథకం లబ్ధిదారులకు సెంటు స్థలం చొప్పున ఇస్తూ జీవోలను తెచ్చింది.


ఈ చట్టసవరణ న్యాయసమ్మతం కాదంటున్న రైతులు


రాజధాని భూములను దాని అవసరాల కోసం కాకుండా ఇతర అవసరాల కోసం ఇవ్వటాన్ని రైతులు తప్పుపడుతూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు కూడా రైతులకు సానుకూలంగా స్పందించింది. ఈ జీవోలు సీఆర్డీఏ చట్టానికి, మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ జీవోలను కొట్టివేసింది. సీఆర్డీఏ చట్టాన్ని కూడా గతంలో ఏపీ ప్రభుత్వం తొలగించింది. కానీ మళ్లీ పునరుద్ధరించింది. రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాలపై ఇప్పటికీ విచారణ జరుగుతోంది. ఈ లోపే ప్రభుత్వం చట్టం చేసింది. గవర్నర్ ఆమోదించేశారు. మాస్టర్ ప్లాన్ మార్పులు కూడా కోర్టు తీర్పు ప్రకారం చేయకూడదంటున్నారు.