Stocks to watch today, 16 December 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 65 పాయింట్లు లేదా 0.35 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,394 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ రిటైల్‌కు చెందిన FMCG విభాగం అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (Reliance Consumer Products) కొత్త బ్రాండ్‌ను లాంచ్‌ చేసింది. 'ఇండిపెండెన్స్‌' బ్రాండ్‌ పేరిట గుజరాత్‌లో కిరాణా సరుకుల అమ్మకాలు మొదలు పెట్టనుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్‌ను పరిచయం చేస్తుంది.


విప్రో: మిడిల్‌ ఈస్ట్‌లోని కార్పొరేట్ బ్యాంకుల కోసం ఫిన్‌టెక్ సంస్థ ఫినాస్ట్రాతో (Finastra) మల్టీ ఇయర్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పార్ట్‌నర్‌షిప్‌ ఒప్పందం మీద ఈ ఐటీ మేజర్‌ సంతకం చేసింది. ఈ ఒప్పందం ఫలితంగా, ఫినాస్ట్రా అందించే ట్రేడ్ ఫైనాన్స్ సొల్యూషన్స్‌ను అమలు చేసే ఎక్స్‌క్లూజివ్‌, గో-టు-మార్కెట్ పార్ట్‌నర్‌గా విప్రో అవతరిస్తుంది.


హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్: ఈ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ, తన చమురు శుద్ధి & ఇంధన మార్కెటింగ్ కార్యకలాపాల నిధుల కోసం దేశీయ లేదా విదేశీ మార్కెట్ నుండి రూ. 10,000 కోట్ల రుణాన్ని సమీకరించనుంది. 


FSN ఈ-కామర్స్ వెంచర్స్ (నైకా): BSE నుంచి వచ్చిన డేటా ప్రకారం, 3.67 కోట్ల నైకా షేర్‌లను ఐదు విడతలుగా క్రేవిస్‌ ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్‌నర్స్ II ఆఫ్‌లోడ్‌ చేసింది. ఒక్కో షేరును సగటు ధర రూ. 171 చొప్పున ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మి, రూ. 629.06 కోట్లను వెనక్కు తీసుకుంది.


జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్: బకాయిలను రికవరీ చేసేందుకు ఈ మీడియా సంస్థపై దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను IDBI బ్యాంక్ ఆశ్రయించింది. రూ. 149.60 కోట్ల మొత్తాన్ని IDBI బ్యాంక్  క్లెయిమ్ చేసింది.


దీపక్ ఫెర్టిలైజర్స్: పారిశ్రామిక రసాయనాలు, ఎరువులను తయారు చేసే ఈ కంపెనీ, కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. దీని కింద, మైనింగ్ కెమికల్స్, ఎరువుల వ్యాపారాలను విడదీస్తుంది. పూర్తి స్థాయి అనుబంధ సంస్థ స్మార్ట్‌కెమ్ టెక్నాలజీస్ బోర్డు ఈ ప్రణాళికను ఆమోదించింది.


మాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్: ముంబయిలో డాక్టర్ బాలాభాయ్ నానావతి హాస్పిటల్‌లో, ఫేజ్-1లో భాగంగా, పడక సామర్థ్య విస్తరణ ఖర్చుకు పాక్షికంగా ఆర్థిక సహాయం చేయడానికి తన పూర్తి యాజమాన్యంలోని మాక్స్ హాస్పిటల్స్ అండ్ అలైడ్ సర్వీసెస్‌కు రూ. 300 కోట్ల వరకు నిధులను అందించడానికి మాక్స్‌ హెల్త్‌కేర్‌ బోర్డు ఆమోదించింది.


సఫైర్ ఫుడ్స్ ఇండియా: సఫైర్ ఫుడ్స్ మారిషస్, WWD రూబీ కలిసి 10.7 శాతం వాటాను లేదా 68.25 లక్షల సఫైర్ ఫుడ్స్ షేర్లను విడతల వారీగా ఆఫ్‌లోడ్ చేశాయి. సగటున ఒక్కో షేరును రూ. 1,347కు అమ్మాయి. తద్వారా రూ. 919.27 కోట్లను సంపాదించాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.