Stock Market News: ఆదాయం, ఖర్చులను బట్టి ఒక కంపెనీ లాభదాయకత (Profitability) మారుతుంది. వర్కింగ్ క్యాపిటల్ లేదా లిక్విడిటీ పొజిషన్‌ది కూడా లాభదాయకతను నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర. వర్కింగ్ క్యాపిటల్‌ని సమర్థవంతంగా మేనేజ్‌ చేయగలిగిన సంస్థ తన లాభదాయకతను స్థిరంగా పెంచుకుంటోందని అభివృద్ధి చెందిన & అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లలో నిర్వహించిన అనేక అధ్యయనాలు తేల్చాయి. ఇలాంటి కంపెనీలే ఇన్వెస్టర్లకు లాభాలను కురిపిస్తున్నాయి.


ఇండియన్‌ మార్కెట్‌లో వర్కింగ్ క్యాపిటల్‌ను ఎఫీషియంట్‌గా మేనేజ్‌ చేయడంలో నిలకడ చూపుతున్న కంపెనీల గురించి మార్కెట్‌ ఎక్స్‌పర్ట్‌లు ఆరా తీశారు. BSEలో లిస్టయిన, రూ. 500 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్‌ విలువ ఉన్న టాప్‌ 1,010 కంపెనీలకు చెందిన (బ్యాంకులు, ఫైనాన్షియల్స్, ఇన్సూరెన్స్, ఐటీ, టెలికాం, యుటిలిటీస్ మినహా) గత 4 సంవత్సరాల (2018-19 నుంచి 2021-22 వరకు) డేటాను బ్లూమ్‌బెర్గ్ నుంచి సేకరించారు. వాటి ఆర్థిక చరిత్రను తిరగేసి ఆరు కంపెనీలను షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఈ ఆరు స్టాక్స్ సంబంధిత ఇండస్ట్రీల సగటు కంటే బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ చేస్తున్నాయి. ఒక ఏడాదిలో ఇవి రెండంకెల వృద్ధి సామర్థ్యాన్ని అందించగలని నమ్ముతున్న ఎక్స్‌పర్ట్‌లు, అందుకుతగ్గ ప్రైస్‌ టార్గెట్లు, బయ్‌ రేటింగ్‌ ఇచ్చారు.


అదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ (Aditya Birla Fashion and Retail) 
ఇండస్ట్రీ: పర్సనల్‌ గూడ్స్‌
రేటింగ్స్‌: 22 బయ్‌, 0 హోల్డ్‌, 2 సెల్‌
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 319
ఏడాది ప్రైస్‌ టార్గెట్‌: రూ. 372
వృద్ధి సామర్థ్యం: 16.4%


క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జ్యూమర్‌ (Crompton Greaves Consumer)
ఇండస్ట్రీ: హౌస్‌హోల్డ్‌ గూడ్స్‌
రేటింగ్స్‌: 41 బయ్‌, 2 హోల్డ్‌, 2 సెల్‌
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 364
ఏడాది ప్రైస్‌ టార్గెట్‌: రూ. 454
వృద్ధి సామర్థ్యం: 24.6%


ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ (Orient Electric) 
ఇండస్ట్రీ: ఎలక్ట్రానిక్‌ & ఎలక్ట్రికల్స్‌
రేటింగ్స్‌: 12 బయ్‌, 5 హోల్డ్, 2 సెల్‌
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 264
ఏడాది ప్రైస్‌ టార్గెట్‌: రూ. 308
వృద్ధి సామర్థ్యం: 16.5%


టైటన్‌ (Titan)
ఇండస్ట్రీ: పర్సనల్‌ గూడ్స్‌
రేటింగ్స్‌: 25 బయ్‌, 4 హోల్డ్‌, 3 సెల్‌
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 2,735
ఏడాది ప్రైస్‌ టార్గెట్‌: రూ. 3,009
వృద్ధి సామర్థ్యం: 10%


టిమ్‌కెన్‌ ఇండియా (Timken India )
ఇండస్ట్రీ: ఇండస్ట్రియల్‌ మెటల్స్‌ & మైనింగ్‌
రేటింగ్స్‌: 5 బయ్‌, 1 హోల్డ్‌ 1 సెల్‌
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 2,691
ఏడాది ప్రైస్‌ టార్గెట్‌: రూ. 3,143
వృద్ధి సామర్థ్యం: 16.8%


సింఫనీ (Symphony )
ఇండస్ట్రీ: హౌస్‌హోల్డ్‌ గూడ్స్‌
రేటింగ్స్‌: 7 బయ్‌, 1 హోల్డ్‌, 1 సెల్‌
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 841
ఏడాది ప్రైస్‌ టార్గెట్‌: రూ. 1,168
వృద్ధి సామర్థ్యం: 38.9%


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.