కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ - 2020 స్కిల్ టెస్ట్  ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) అక్టోబర్ 18న విడుదల చేసింది.  ఎస్ ఎస్ సీ నిర్ణయించిన కటాఫ్ ( డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్) ఆధారంగా 247 మంది, టైపింగ్ టెస్ట్ ఆధారంగా 11297 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికయ్యారు. మొత్తం 11,544 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు అర్హులయ్యారు. మొత్తం 4726 ఖాళీలకు ఈ ఎంపిక నిర్వహించారు.


ఫలితాల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి:


LIST-1 (DEO Posts)

LIST-1 (LDC/JSA/JPA, PA/SA Posts)


కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..



స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీహెచ్‌ఎస్‌ఎల్‌ (SSC CHSL) 2020కు సంబంధించిన జులై 1న స్కిల్‌ టెస్ట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. సీహెచ్‌ఎస్ఎల్‌ టైర్‌-2 (డిస్క్రిప్టివ్ పేపర్) పరీక్ష ఈ ఏడాది జనవరి 9న జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 45,480 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీటికి సంబంధించిన ఫలితాలు మే 13న విడుదలయ్యాయి. ఇక తదుపరి ఘట్టమైన స్కిల్‌ టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. టైర్-I, టైర్-IIలలో కమిషన్ కట్-ఆఫ్ ప్రకారం.. మొత్తం 28,133 మంది అభ్యర్థులు DEST/టైపింగ్ పరీక్షకు హాజరుకాగా.. 11,544 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు అర్హత సాధించారు.



 :: Also Read ::  


ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పీవో ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!


గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్-1 (పీవో) పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) అక్టోబరు 18న ప్రకటించింది. అదేవిధంగా స్కేల్-II, స్కేల్-III ఆఫీసర్ ఆన్‌లైన్ పరీక్ష (సింగిల్ స్టేజ్) ఫలితాలను కూడా ఐబీపీఎస్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. అక్టోబరు 28 వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థుల స్కోరు వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. 
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


 


గ్రామీణ డాక్ సేవక్ -2022 ఫలితాలు విడుదల, ఎంపికైంది వీరే!


తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోస్టాఫీస్ సర్కిళ్ల పరిధిలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నియామకాలకు సంబంధించిన ఆరో జాబితాను పోస్టల్ శాఖ అక్టోబర్ 18న విడుదల చేసింది. పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తుల్ని స్వీకరించింది. గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


 


సీడాక్‌‌లో 530 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు
పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...