గార ఎస్బీఐ బ్రాంచ్‌లో బంగారం మాయం శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారింది. వారం రోజులపాటు శ్రమించిన పోలీసులు ఈ కేసును ఛేదించారు. నిందితులను అరెస్టు చేయడమే కాకుండా బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. గత నెల 30న రీజనల్ మేనేజర్ టీఆర్ఎం రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. 86 బ్యాగుల్లో ఉంచిన 7,146 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు విచారించి ఏడుగుర్ని నిందితులుగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో రెండు టీంలు ఈకేసులో పని చేశాయి. బ్యాంకు డిప్యూటీ మేనేజర్ పని చేసిన ఉరిటి స్వప్నప్రియ ఇదంతా చేసినట్టు తేల్చారు. తన అన్న కిరణ్‌బాబుతో కలిసి వ్యాపారాలు చేసిన నష్టపోయారు. వాటిని రికవరీ చేసుకునేందుకు క్యాష్ ఆఫీసర్ సురేష్‌తో కలిసి దొంగతనానికి ప్లాన్ చేశారు.
బంగారం భద్రపరిచే రూమ్‌లో కస్టోడియన్ సురేష్‌తో కలిసి కనిపించాల్సిన స్వప్నప్రియ ఒక్కరే ఉండడంతో అనుమాన పడ్డామన్నారు అధికారులు. బ్యాగులను చెక్ చేస్తే కొన్ని పోయినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అన్నకు ఉన్న రాజకీయ పలుకుబడితో తప్పించుకోవచ్చని అనుకున్నారు. మొదట లోహితాక్షి లోన్స్ కన్సల్టెన్సీ సర్వీస్ యజమాని పొన్నాడ తిరుమలరావుకు 2022 సెప్టెంబరులో 100 గ్రాముల బంగారం ఇచ్చారు. దాన్ని ఆయన శ్రీకాకుళంలో ఉన్న ఫెడరల్ బ్యాంకులో తనఖా పెట్టి రూ.4 లక్షల రుణం తీసుకొని స్వప్నప్రియకు ఇచ్చారు. దీనికి తిరుమలరావుకు రూ.3వేలు కమీషన్ ముట్టింది. ఆ తర్వాత విడుతల వారీగా తిరుమలరావుకు బంగారు ఆభరణాలు ఇవ్వడం అప్పులు తీసుకురావడం అలవాటుగా మారిపోయింది. ఫెడరల్ బ్యాంకుతోపాటు శ్రీకాకుళం, ఆమదాలవలస, అరసవల్లిలో ఉన్న సీఎస్బీ బ్యాంకుల్లోను లోన్లు తీసుకున్నారు.
ఇందులో ఈ ముగ్గురితోపాటు మోహన్‌చంద్, సీఎస్బీ బ్యాంకు ఉద్యోగులు గణపతిరావు, తారకేశ్వరరావు, మార్పు వెంకటరమేష్ హస్తం ఉంది. లోన్ ద్వారా వచ్చిన సొమ్మును స్వప్నప్రియ, ఆమె సోదరుడు కిరణ్, రాజారావు ఖాతాల్లో వేసుకునే వాళ్లు. వీటన్నింటికీ తిరుమలరావుకు కమీషన్ ఇచ్చేవారు. ఇలా సుమారు రూ.1.50కోట్లు స్వప్నప్రియ, ఆమె సోదరుడు, రాజారావు, తిరుమలరావు కొట్టేశారు.
విషయం బయటకు రావడంతో స్వప్న ప్రియ ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన నిందితులు తిరుమలరావు, కిరణ్‌బాబు, రాజారావు, గణపతిరావు, తారకేశ్వరరావు, మార్పు వెంకటరమేష్, మోహన్‌చంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోయిన బంగారాన్ని రికవరీ చేశారు. క్యాష్ ఆఫీసర్ ముంజు సురేష్ మాత్రమేనని త్వరలో పట్టుకుంటామన్నారు పోలీసులు.
ఎస్బీఐలో తాకట్టు పెట్టిన బంగారాన్ని ఎప్పటికప్పుడు నిందితులు ప్రైవేటు బ్యాంకులకు తరలించేవారు. ఇందుకోసం ఫెడరల్ బ్యాంకు, సీఎస్బీల్లో బినామీ పేర్లతో ఖాతాలు తెరిచారు. ఇందులో తిరుమలరావు మామ మోహన్‌చంద్ పేరు మీదే ఐదు ఖాతాలు ఉన్నాయి. గార బ్యాంకులో తనఖాకు వచ్చిన బంగారాన్ని ప్రైవేటు బ్యాంకుకు తరలించిన తర్వాత తమ బంగారం కావాలంటూ విడిపించుకోడానికి ఎవరైనా వస్తే దాన్ని ప్రైవేటు బ్యాంకులో తాకట్టు నుంచి విడిచిపించాల్సి ఉంది. అందుకని ఎస్బీఐకి వచ్చిన ఖాతాదారులకు వారం దాటాక వస్తే నగలిస్తామని పంపించేవాళ్లు.
ఈలోగా ఎస్బీఐకి వచ్చిన కొత్త తాకట్టు బంగారాన్నిప్రైవేటు బ్యాంకుకు పంపించి పాత బంగారాన్నితీసుకొచ్చేవారు. ఆ విధంగా కొందరికి బంగారం దక్కింది. అయితే ఇటీవల బ్యాంకుకు కొత్తగా తాకట్టు పెట్టడానికి పద్దులేవీ రాకపోగా, పాతవాటిని విడిపించుకోవాలని కస్టమర్లు రావడంతో ఒకేసారి అంత మొత్తంలో వెనక్కితేలేక చేతులెత్తేశారు. దీన్ని కప్పిపుచ్చుకోడానికి 86 బ్యాగుల స్థానంలో ముందుగా 26 బ్యాగులు తాకట్టు నుంచి విడిపించి కిరణ్, రాజారావుతో వెనక్కి పంపించారు.
పోలీసులు అత్యంత చాకచక్యంగా ఖాతాదారుల బంగారాన్ని వెనక్కి తీసుకురాగలిగారు. ఈఆపరేషన్‌లో నలుగురు సీఐలు, ఆరుగురుఎస్ఐలు, ఒక డీఎస్పీ పాల్గొన్నారు. రికవరీ చేసిన బంగారాన్ని కోర్టు ద్వారా బ్యాంకుకు అప్పగించనున్నట్టు ఎస్పీ తెలిపారు. కేసు