Karnataka High Court  :   కర్ణాటకలోని చిక్ మగళూరులో కొంతకాలం కిందట ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. ఓ వ్యక్తి.. తన ప్రత్యర్థి వృషణాలను కొట్లాటలో భాగంగా గట్టిగా పిసికేశాడు. దాంతో  ఆ వ్యక్తి బాధతో విలవిల్లాడిపోయాడు. తీవ్రమైన గాయాలు వృషణాలకు అయనట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు వృషణాలు నొక్కిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు పెట్టారు. కోర్టులో విచారణ జరిగింది.ఇది నిజంగానే  హత్యాయత్నం అని దిగువకోర్టు నిర్ణయించి ఏడేళ్ల జైల శిక్ష విధించింది. అయితే తాను హత్యాయత్నం చేయలేదని.. ఉద్దేశపర్వకంగా వృషణాలను నలిపివేయలేదని..చెప్పి హైకోర్టులో .. దిగువ కోర్టు తీర్పును సవాల్ చేశారు.                         


'ఇది రాష్ట్రమా....? రావణ కాష్ఠమా..?' - ఏపీలో శాంతిభద్రతల తీరుపై టీడీపీ కొత్త ప్రచారఉద్యమం !                 
   
విచారణ జరిపిన హైకోర్టు.. ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నప్పుడు యాధృచ్చికంగా వృషణాలను నొక్కేయడం హత్యయత్నం కిందకు రాదని తేల్చింది.అంతే కాదు ఆ వ్యక్తికి దిగువకోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను మూడేళ్లకు తగ్గిచింది. ఈ కేసులో  గాయపడిన వ్యక్తిని .. నిందితుడు ఉద్దేశపూర్వకంగా వృషణాలు నొక్కలేదని అభిప్రాయడ్డారు.   “అక్కడికక్కడే నిందితులు ,  ఫిర్యాదుదారు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ గొడవలో నిందితుడు వృషణాలను పిసికాడు.  కాబట్టి నిందితుడు హత్యకు సిద్ధమయ్యారని చెప్పలేం. ఒకవేళ అతడు హత్యకు సిద్ధపడి ఉంటే లేదా హత్య చేయడానికి ప్రయత్నించినట్లయితే  కొన్ని మారణాయుధాలను తనతో తీసుకెళ్లి ఉండేవాడని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.             


సిల్లీ బచ్చాను కాదు, సెల్ఫే మేడ్ మ్యాన్‌ను - దమ్ముంటే నాపై పోటీ చెయ్‌- లోకేష్‌పై అనిల్ ఘాటు రియాక్షన్                                 


 " నిందితుడు ప్రత్యర్థిని గాయపరిచేందుకు మరణానికి కారణమయ్యే శరీరంలోని ముఖ్యమైన భాగమైన వృషణాలను ఎంచుకున్నారు.  గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, శస్త్రచికిత్స చేసి  వృషణాలను తొలగించాల్సి వచ్చింది. అందుకే ోనిందితుడి వల్ల కలిగే గాయాన్ని శరీరంలోని ముఖ్యమైన భాగమైన ప్రైవేట్ పార్ట్‌ను పిండడం ద్వారా తీవ్రమైన గాయం చేయడం ద్వారా ఐపిసి సెక్షన్ 324 కిందకు తీసుకురావచ్చు” అని జస్టిస్ కె నటరాజన్ తన ఇటీవలి తీర్పులో పేర్కొన్నారు.                    


గ్రామ జాతర సందర్భంగా నరసింహస్వామి ఊరేగింపులో తాను, ఇతరులు కలిసి నృత్యం చేస్తుండగా నిందితుడు పరమేశ్వరప్ప మోటారు సైకిల్‌పై అక్కడికి వచ్చి గొడవ పడ్డాడు.  బాధితుడు ఓంకారప్ప కూడా అదే గ్రామానికి చెందిన వారు.  . ఆ గొడవలో పరమేశ్వరప్ప ఓంకారప్ప వృషణాలను పిండడంతో తీవ్ర గాయమైంది. పోలీసుల విచారణ, విచారణ అనంతరం అతడిని దోషిగా నిర్ధారించి శిక్ష ఖరారు చేశారు. చివరికి హత్యాయత్నం కేసు సరిపోదని..సెక్షన్ మార్చి శిక్ష తగ్గించారు.                       




Join Us on Telegram: https://t.me/abpdesamofficial