TDP News :   'నాలుగేళ్ల నరకం' అనే పేరుతో టీడీపీ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు  తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు.  రానున్న రోజుల్లో గల్లీ నుండి పట్టణాల వరకు ప్రజలకి జరిగిన అన్యాయాన్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమాలను ఎత్తి  చూపే విదంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


నాలుగేళ్లుగా ప్రజకు నరకం చూపిస్తున్నారంటున్న టీడీపీ                                          


గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ "నాలుగేళ్ల నరకం" కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ  కార్యక్రమం దాదాపు నెల రోజుల పాటు సాగనుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా  తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. గత నాలుగేళ్లుగా వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని   చూపుతూ జనంలోకి మరింత విసృతంగా తీసుకెళ్లనున్నారు.


ఇది రాష్ట్రమా....? రావణ కాష్ఠమా..?'  వీడియో రిలీజ్ చేసిన చంద్రబాబు                                                             


సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ వేదికగా ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ప్రజలకు షేర్ చేశారు.  ఈ ప్రచార కార్యక్రమంలో రంగాలవారీగా నలభైఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో చూపిస్తూ.. ప్రజల వద్దకు తీసుకెళ్లనున్నారు.  క్యాంపెయిన్‌లో భాగంగా తొలి రోజు చంద్రబాబు గారు 'ఇది రాష్ట్రమా....? రావణ కాష్ఠమా..?' అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు గురించి ప్రశ్నిస్తూ... వీడియో రిలీజ్ చేశారు. 





 ఏపీలో శాంతిభద్రతలు లేవని టీడీపీ ఆరోపణలు                             


ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య సోషల్ మీడియా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో  వైసీపీ కొత్త ప్రచార కార్యక్రమం  ప్రారంభించనున్నారు. దీని కౌంటర్ గా టీడీపీ  నాలుగేళ్ల నరకం సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో శాంతి భద్రతలు సరిగ్గా లేవని.  ఏ వర్గం ప్రజలకూ సరైన భద్రత లేదని విపక్ష పార్టీల నేతలు కొంత కాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.  ఈ క్రమంలో జరిగిన దాడులు, దౌర్జన్యాలన్నింటినీ ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలనుకుంటన్నట్లుగా తెలుస్తోంది.