Sri Nagar Airport: జమ్మూ కశ్మీర్ లో జరిగిన టెర్రరిస్టు ఎటాక్ తర్వాత అక్కడ వివిధ ప్రాంతాల్లో ఉన్న పర్యాటకులు ఆందోలన చెందారు. వారి టూర్లు అన్ని ఎక్కడివక్కడ ఆపేశారు. అందరూ వెనుదిగిరి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారు. కశ్మీర్ పర్యటనకు వెలళ్లిన పలువురు కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. వారి క్షేమ సమాచారం కోసం వాకబు చేస్తున్నాయి. ఇలాంటి వరి కోసం ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. 

Continues below advertisement



మరో వైపు పర్యాటకుల్ని ముందుగా ఢిల్లీకి తరలించేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీనగర్ నుంచి ప్రత్యేక రైళ్లు, విమానాలు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పర్యాటకులు ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. వారందరికీ ప్రత్యేకం టెంట్లు వేసి విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అందర్నీ సురక్షితంగా స్వస్థలాలకు తరలిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.  





పర్యాటకులకు కశ్శీరీ ముస్లింలు సాయం చేస్తున్నారు.  పలు చోట్ల ఉన్న పర్యాటకులకు ఆహారం, నీళ్లు సరఫరా చేస్తున్నారు.  





 పర్యాటకుల కోసం తాము ప్రాణాలిస్తామని వారికి హానీ కలిగించే ఉగ్రవాదులను అడ్డుకుంటామని టూరిస్టు ఆపరేటర్లు చెబుతున్నారు. ఈ మేరకు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు.  





 కశ్మీర్ కు టూరిజం పెరుగుతూండటంతో అక్కడి ప్రజల ఆదాయం కూడా  పెరుగుతోంది. ఇప్పుడీ ఘటనతో  టూరిస్టులు ఆగిపోతే వారికి ఉపాధి ఆగిపోతుందన్న ఆందోళన కనిపిస్తోంది.