Spanish Athlete World Record:
స్పానిష్ మహిళా అథ్లెట్ సాహసం..
కొంత మందికి సాహసాలు చేయడం ఓ సరదా. "ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటావ్" అని వారించినా లైట్ తీసుకుంటారు. లైఫ్‌లో రిస్క్ ఉండకపోతే ఎలా అని నవ్వేస్తారు. అసాధ్యం అనుకున్న వాటిని సాధించుకుని వస్తారు. ఇప్పుడు మనం చెప్పుకునే కథ అలాంటి వ్యక్తిదే. ఓ 50 ఏళ్ల స్పానిష్ అథ్లెట్ ఓ అసాధారణ సాహసం చేసింది. ప్రస్తుతం ఆ దేశమంతా ఆమె పేరే మారు మోగుతోంది. చెప్పాలంటే...ఆమెను హీరోయిక్ పర్సనాలిటీగా చూస్తున్నారంతా. ఆమె చేసిన సాహసం అలాంటిది మరి. మీరెప్పుడైనా బొర్ర గుహలకు వెళ్లారా..? కిందకు వెళ్తున్న కొద్ది మరీ చీకటైపోతుంది. కాసేపు అక్కడ తిరిగితేనే భయం వేస్తుంది. అంత చీకటిగా ఉంటే భయం వేయదా...అని అంటారా..? కానీ స్పానిష్‌కు చెందిన మహిళా అథ్లెట్ మాత్రం దాదాపు 230 అడుగుల లోతైన చీకటి గుహలో ఒంటరిగా ఉంది. ఒకటి రెండు రోజులు కాదు. ఏకంగా 500 రోజులు. వింటుంటేనే షాకింగ్‌గా ఉంది కదా. మరో షాకింగ్ విషయం ఏంటంటే...ఆమె వయసు 50 ఏళ్లు. ఈ వయసులో అలాంటి సాహసం ఎవరైనా చేస్తారా..? ఆమె చేసి చూపించింది. Granad సిటీలోని గుహలో 500 రోజుల పాటు ఒంటరిగా ఉండి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రొఫెషనల్ మౌంటేనర్ అయిన బీట్రిజ్ ఫ్లామినీ (Beatriz Flamini) ఆ గుహ నుంచి బయటకు వచ్చింది. ఆమె కోసం నిరీక్షిస్తున్న రిపోర్టర్‌లను చూస్తూ ఓ చిన్న నవ్వింది. బయటకు వచ్చీ రాగానే ఆమె చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా..? "నాకు తెలియకుండానే సమయం గడిచిపోయింది. ఎందుకో బయటకు రావాలని అనిపించలేదు" అని. ఈ మాట విని రిపోర్టర్‌లు ఇంకా షాక్‌కు గురయ్యారు.
"నన్ను తీసుకెళ్లడానికి చాలా మంది వచ్చారు. ఆ సమయానికి నేను మంచి నిద్రలో ఉన్నాను. ఏదో జరుగుతోందని తెలుస్తోంది. ఆ తరవాత అర్థమైంది. నేను బయటకు వెళ్లాల్సిన టైమ్ వచ్చిందని. అప్పటికి నేను చదువుకున్న బుక్‌ని పూర్తి చేయలేకపోయాను"
- బీట్రిజ్ ఫ్లామినీ, స్పానిష్ అథ్లెట్
ఇదో వరల్డ్ రికార్డ్
ఫ్లామినీ టీమ్ ఓ కీలక ప్రకటన చేసింది. గుహలో ఎక్కువ రోజులు గడిపిన వ్యక్తిగా బీట్రిజ్ వరల్డ్ రికార్డ్ సాధించిందని వెల్లడించింది. Circadian Rhythmsపై అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలకు సహకరించేందుకు బీట్రిజ్ ఈ పని చేశారు. వాతావరణంలోని మార్పుల ఆధారంగా మన బ్రెయిన్‌లో జరిగే మార్పులను తెలియజేసేదే Circadian Clock.దీనిపైనే సైంటిస్ట్‌లు స్టడీ చేశారు. బీట్రిజ్ ఫ్లామినీ గుహలోకి వెళ్లినప్పుడు ఆమె వయసు 48 ఏళ్లు. బయటకు వచ్చే నాటికి ఆమె వయసు 50 ఏళ్లకు. అంటే ఆ గుహలోనే రెండు బర్త్‌డేలు చేసుకున్నారు. 2021 నవంబర్ 20న ఆమె గుహలోకి వెళ్లిపోయారు. ఇన్ని రోజుల పాటు ఆమె రోజూ వ్యాయామం, పెయింటింగ్‌తో కాలక్షేపం చేసింది. రెండు GoPro కెమెరాలతో డాక్యుమెంటరీ తీసింది. 60 పుస్తకాలు, వెయ్యి లీటర్ల నీళ్లు తీసుకెళ్లింది.
Also Read: Kim Jong Un's Daughter: బడికెళ్లాల్సిన వయసులో మిజైల్ టెస్ట్‌లు, కిమ్ కూతురు సెన్సేషన్