Matrimonial Site Fraud:


రిచ్‌ పార్టీ అంటూ డ్రామా


ఫుల్ సౌండ్ పార్టీ అని చెప్పాడు. లగ్జరీ కార్‌ల పక్కన నిలబడి ఫోటోలు తీసుకున్నాడు. విల్లాలు, ఫామ్‌హౌజ్‌లు కూడా ఉన్నాయని బిల్డప్ ఇచ్చాడు. మ్యాట్రిమొనీ సైట్‌లో ఓ అమ్మాయికి ఈ ఫోటోలన్నీ పంపాడు. ఇక పెళ్లి చేసుకోవడమే మిగిలింది అనుకునే టైమ్‌లోని పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఆ మహిళను మోసం చేసి అడ్డంగా దొరికిపోయాడు. యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన విశాల్ అనే 26 ఏళ్ల యువకుడు తనను తాను "రిచ్ బ్యాచిలర్‌" అని ప్రచారం చేసుకున్నాడు. తనకు తగిన జోడీ కోసం వెతుకుతున్నట్టు మాయ మాటలు చెప్పాడు. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేసేందుకు లగ్జరీ కార్‌లలో తిరుగుతున్నట్టు ఫోటోలు, వీడియోలు పంపేవాడు. ఈ కేటుగాడి వలలో పడిన ఓ మహిళ రూ.3 లక్షలు కోల్పోయి చివరకు పోలీసులను ఆశ్రయించింది. చీప్‌గా iPhones ఇస్తానంటూ మూడు లక్షలు తీసుకుని సైలెంట్‌గా ఉండిపోయాడు నిందితుడు. మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాక కానీ...ఈ నాటకం అంతా బయట పడలేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే...ఆ నిందితుడు బాగా చదువుకున్నాడు. పైగా ఓ MNCలో ఉద్యోగం కూడా చేశాడు. సొంతగా వ్యాపారం మొదలు పెట్టాడు. కానీ ఆ వ్యాపారంలో బాగా నష్టాలొచ్చాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఓ ఐడియా వచ్చింది. ఈజీమనీ కోసం ప్రయత్నించాడు. వెంటనే మ్యాట్రిమొనీ సైట్‌లో ఫోటోలు పెట్టి డ్రామా స్టార్ట్ చేశాడు. పోలీసుల అరెస్ట్‌తో ఈ నాటకానికి తెర పడింది. 


HR ప్రొఫెషనల్ అట..


బాధితురాలు గుడ్‌గావ్‌లో ఓ MNCలో పని చేస్తోంది.  మ్యాట్రిమొనీ సైట్‌లో ఆ బాధితురాలి తల్లిదండ్రులు ఓ అకౌంట్ క్రియేట్ చేశారు. తగిన ప్రొఫైల్స్‌ కోసం వెతుకుతున్న క్రమంలోనే విశాల్‌ బయో కనిపించింది. HR ప్రొఫెషనల్ అని ప్రొఫైల్‌లో రాసుకున్నాడు నిందితుడు. అంతే కాదు. 50-70 లక్షల ప్యాకేజ్‌ అని చెప్పాడు. ఇది చూసి వెంటనే రిక్వెస్ట్ పెట్టింది బాధితురాలి కుటుంబం. ఒకరికొకరు నంబర్‌లు ఇచ్చుకున్నారు. చాలా రోజుల పాటు ఛాటింగ్ కూడా చేసుకున్నారు. 


"ఈ ఏడాది మార్చిలో విశాల్ నాకు కొన్ని ఫోటోలు పంపాడు. అందులో లగ్జరీ కార్‌లు, విల్లాస్ కనిపించాయి. ఆ కార్‌లలో ఏం కావాలో కోరుకోమంటూ నన్ను అడిగాడు. కొన్ని ఫామ్‌హౌజ్‌ల ఫోటోలు కూడా పంపాడు. గుడ్‌గావ్‌లో ప్రాపర్టీలు ఉన్నాయని చెప్పాడు. పెద్ద ఫుడ్‌ బిజినెస్ ఉందని అన్నాడు. ఇదంతా చూశాక నిజమే అని నమ్మి వ్యక్తిగతంగా కలవాలని డిసైడ్ అయ్యాను.  iPhone 14 Pro Max ఫోన్‌ తక్కువ ధరకే వస్తుందని చెప్పి నా చేత కొనిపించాడు. మా బంధువులకు కూడా కొనాలని కన్విన్స్ చేశాడు. ఇది నమ్మి నేను రూ.3.05 లక్షలు  పంపాను. నేను అలా డబ్బు పంపగానే బ్లాక్ చేశాడు. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో ఉన్నానని చెప్పాడు. కొద్ది రోజుల తరవాత కానీ నాకు అర్థం కాలేదు మోసపోయానని"


- బాధితురాలు 
 


Also Read: US Man Surgery: డేటింగ్‌కు అడ్డొచ్చిన హైట్, 5 ఇంచులు పెరిగేందుకు కోటిన్నర సమర్పించాడు