Yash 19 Movie Update : జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ (Geethu Mohandas), సెన్సేషనల్ హీరో యష్ (Yash )తో కలసి ఓ సినిమా చేయనున్నారా? యస్ 19వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని ఆమె అందుకున్నారా? అంటే... కన్నడ సినిమా వర్గాల్లో కొందరు 'అవును' అంటున్నారట. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని సమాచారం. దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.


ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన 'కేజీఎఫ్ (KGF)', 'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాయి. 'కేజీఎఫ్' భారతీయ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. దాంతో యష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆయన నటించబోయే తదుపరి చిత్రంపై పలు ఊహాగానాలు సైతం ఏర్పడ్డాయి. అభిమానులు ఇప్పటికే 'కేజీఎఫ్ చాప్టర్ 3' కోసం ఎదురు చూస్తుండగా.. తాజాగా యష్ మరో చిత్రంపై క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఆయన నెక్స్ట్ సినిమాను జాతీయ అవార్డు గెలుచుకున్న, దర్శకురాలు 'గీతు మోహన్‌దాస్‌'తో చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది.


తన తదుపరి చిత్రంపై స్పందించిన యష్... డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ తో సినిమా కోసం గత ఏడాది నుంచి చర్చలు సాగుతున్నాయన్నారు. గీతు తన వద్దకు వచ్చిన కాన్సెప్ట్‌తో తాను బౌల్డ్ అయ్యానన్నారు. 'కేజీఎఫ్' సిరీస్ తో భారీ హిట్ లను అందుకున్న యష్.. పెద్ద పేరున్న డైరెక్టర్లతో తన నెక్స్ట్ ప్రాజెక్టు చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతలోనే రాకింగ్ స్టార్ ఓ మలయాళ స్క్రిప్టును ఓకే చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.  


యష్ ఈ సారి బడ్జెట్ బేస్డ్ సినిమాపై కంటే కథకు హైప్ తీసుకువచ్చే మూవీ తీయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పట్నుంచే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ఇక కథలకు ప్రాధాన్యత ఇస్తూ రిస్క్ లు చేసే యష్ కి ఆ కథ ఛాలెంజింగ్ గా అనిపించడంతో ఓకే చెప్పినట్లు, దీని పై కొంత కాలంగా వర్క్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చలు నడుస్తోన్న ఈ సినిమాను మరో 30రోజుల్లో ప్రకటిస్తారని యష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.


'లైయర్స్ డైస్' సినిమాతో డైరెక్టర్ గా సినీ రంగ ప్రవేశం చేసిన గీతు మోహన్‌దాస్ అలియాస్ గాయత్రీ దాస్ దర్శకురాలే కాదు నటి కూడా. గీతు మోహన్‌దాస్ 'కెల్క్కున్నుందో ఆర్ యు లిజనింగ్' అనే షార్ట్ ఫిల్మ్‌తో దర్శకురాలిగా పరిచయం అయ్యింది. ఇది అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడగా.. భారతదేశంలో ఉత్తమ షార్ట్ ఫిక్షన్, జాతీయ అవార్డు విభాగంలో 3 అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది. 2014లో విడుదలైన ఆమె మొదటి చలనచిత్రం 'లయర్స్ డైస్' భారతదేశంలో 2 జాతీయ అవార్డులను గెలుచుకుంది.


Also Read ప్రభాస్ ఫ్యాన్స్‌ను భయపెట్టిన 'శాకుంతలం' - 'ఆదిపురుష్' ఎలా ఉంటుందో? 


ఇదిలా ఉండగా.. ఇటీవలే 'కేజీఎఫ్ చాప్టర్ 2' రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్' ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చింది. 'కేజీఎఫ్ చాప్టర్ 3'పై ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో రాఖీ భాయ్ 1971 నుంచి 1981 మధ్య కాలంలో ఎక్కడ ఉన్నాడు? ఆ టైంలో రాఖీ ఏమి చేశాడు అనే కథనంతో థర్డ్ పార్ట్ ఉండబోతుందని తెలియజేశారు. 2025లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Also Read : పవన్ కళ్యాణ్ మాసివ్ యాక్షన్ సీన్ - 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో...