Smriti Irani's Defamation Suit: 


నిజాలేంటో తేల్చి చెబుతాం: జైరాం రమేశ్ 


కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపారు స్మృతి ఇరానీ. ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ స్పందించారు. "కాంగ్రెస్ నేతలు దీన్ని ఛాలెంజింగ్‌ తీసుకున్నారు. కచ్చితంగా ఇది నిజమని నిరూపిస్తాం" అని వెల్లడించారు. దిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ట్విటర్‌లో ఈ విధంగా స్పందించారు జైరాం రమేశ్. స్మృతి ఇరానీ దిల్లీ హైకోర్ట్‌లో కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేశారు. రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. "మాపై పరువు నష్టం దావా కేసు వేశారు. ఇందుకు సంబంధించి సమాధానం చెప్పాలంటూ దిల్లీ హైకోర్టు మాకు సమన్లు జారీ చేసింది. కచ్చితంగా మేం కోర్టులో ఆధారాలు ప్రవేశపెడతాం. ఛాలెంజ్ చేసి మరీ నిజాలు వెలికి తీస్తాం" అని ట్వీట్‌లో పేర్కొన్నారు జైరాం రమేశ్.





 


ఆ పోస్ట్‌లన్నీ డిలీట్ చేయండి: దిల్లీ హైకోర్ట్ 


కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే స్మృతి ఇరానీ స్పందించారు. నిరాధారమైన ఆరోపణలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు చేసిన వారందరికీ లీగల్ నోటీసులు కూడా పంపారు. కాంగ్రెస్ నేతలైనా జైరామ్ రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజా పై పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలోనే దిల్లి హైకోర్టు ఆయా నేతలకు సమన్లు జారీ చేసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురుపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను వెంటనే తొలగించాలని
ఆదేశించింది. కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా తమ పరువుకు భంగం కలిగించారని, ఇదో కుట్ర అని కేంద్ర మంత్రి తన పరువు నష్టం దావాలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల పబ్లిక్‌ లైఫ్‌లో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అందులో ప్రస్తావించారు. క్యారెక్టర్‌ను డిఫేమ్ చేసే చర్యగా అభివర్ణించారు. ఈ తీర్పునిచ్చే క్రమంలో జస్టిస్ మిని పుష్కరణ కీలక వ్యాఖ్యలు చేశారు. "గోవాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు ఇల్లీగల్‌గా బార్ నడుపుతున్నారన్న ఆరోపణలకు సంబంధించిన పోస్ట్‌లను యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌ నుంచి తొలగించాలి. మార్ఫ్‌డ్ పిక్చర్లు, వీడియోలు, రీట్వీట్లు, ఆమె కూతురు ఫోటోలు కూడా వెంటనే డిలీట్ చేయాలి" అని ఆదేశించారు. "వాస్తవాలు, ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేసినందుకు గానూ ప్రెస్‌మీట్ సహా, సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కామెంట్లు ఏవి ఉన్నా తొలగించాలి" అని చెప్పారు. 


Also Read: UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకబడ్డ రిషి- ఆ ఒక్క హామీ కొంప ముంచింది!


Also Read: Prabhas: ప్రభాస్‌కు మరో సర్జరీ - ఇదిగో క్లారిటీ!