ఇటీవల 'సలార్' సినిమా షూటింగ్ లో ప్రభాస్ కి గాయాలయ్యాయి. దీంతో చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. యూరప్ లో ఈ ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభాస్. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా 'ప్రాజెక్ట్ K' నిర్మాత అశ్వనీదత్.. ప్రభాస్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడంటూ కామెంట్స్ చేశారు. 'సీతా రామం' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ చీఫ్ గెస్ట్‌గా రావాల్సి ఉందని.. కానీ కాలి సర్జరీ కోసం ఆయన ఫారెన్ కి వెళ్లినట్లు అశ్వినీదత్ చెప్పారు.
ఇప్పటికే ప్రభాస్ కి ఒకసారి సర్జరీ అయింది. ఇప్పుడు మళ్లీ సర్జరీ అని చెప్పడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. నిజానికి ప్రభాస్ ఈసారి యూరప్ వెళ్లింది సర్జరీ కోసం కాదట. కేవలం చెకప్ కోసం ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది. పోస్ట్ ఆపరేషనల్ చెకప్ లో భాగంగా ప్రభాస్ యూరప్ కి వెళ్లారు. ఆగస్టు మొదటివారంలో ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
ఒకట్రెండు వారాల తరువాత తిరిగి 'సలార్', 'ప్రాజెక్ట్ K' సినిమాల షూటింగ్ పునః ప్రారంభిస్తారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా 'ప్రాజెక్ట్ K' సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఐదొందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ అవెంజర్స్ రేంజ్ లో సినిమా ఉంటుందని ఇటీవల అశ్వనీదత్ వెల్లడించారు.